Telangana BJP MLA Alleti Maheshwar Reddy Sensational Comments On CM Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నాడంటూ బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. ఆయన పబ్లిక్ మీటింగ్ లో చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి పసలేదని ఎద్దేవా చేశారు. ఒక సీఎంగా స్థాయిలో కాకుండా.. ఏదో పార్టీ యువజన నాయకుడిగా మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. ఎక్కడ తన సీటు పోతుందో అంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారంటూ కీలక వ్యాఖ్యలుచేశారు. తెలంగాణ కాంగ్రెస్ లో ఆగస్ట్ సంకోభం ఏర్పడుతుందని అన్నారు. ఓటుకు నోటులో తప్పులు చేయలదని, నిజాయితీని నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. రేవంత్ ఎన్నికల ప్రచారంలో పీఎం మోదీపై ఇష్టమున్నట్లు వ్యాఖ్యలు చేస్తున్నారని, ఆయన గురించే మాట్లాడే నైతికత సీఎంరేవంత్ కు లేదన్నారు.
Read More: DK Shiva kumar: ఓటుకు నీళ్లు ఆఫర్.. డీకే శివకుమార్ పై కేసు నమోదు చేసిన పోలీసులు..
జులైలో ఓటుకు నోటు కేసు మరల తెరపైకి రానుందని, దమ్ముంటే తప్పుచేయలేదని నిరూపించుకొవాలని ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ 14 సీట్లు గెలుస్తుందని రేవంత్ అంటున్నారని, ఒక వేళ అన్ని సీట్లు గెలిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని విమర్శించారు.
సీఎం రేవంత్ కు 31 జీవో పై ఎన్నిసార్లు చెప్పిన కూడా నోరు మెదపట్లేదన్నారు. ప్రజలను మభ్యపెట్టి, ఆచరణ సాధ్యంకానీ హమీలు ఇచ్చి రేవంత్ సీఎం అయ్యారని విమర్శించారు. తెలంగాణలో బీజేపీ 12 సీట్లు గెలవడం ఖాయమన్నారు. తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేయడంతో, రామరాజ్యం తీసుకొని రావడం కూడా పక్కా అని ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా తెలంగాణ రాజకీయాలు సమ్మర్ లో మరింత హీట్ ను పుట్టిస్తున్నాయి. ఇప్పటీకే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంపీ, ఎమ్మెల్యేలు, కడియం శ్రీహరి,కే కేశవరావు, దానంనాగేందర్ వంటి సీనియర్ లీడర్ల కాంగ్రెస్ కండువ కప్పుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి అనేక సందర్భాలలో కాంగ్రెస్ పార్టీ గెట్లు ఎత్తితే అనేక మంది బీఆర్ఎస్ లీడర్లు జాయిన్ అవ్వడానికి పరిగెత్తుకుంటూ వస్తారంటూ వ్యాఖ్యలు చేశారు. ఆయన అన్నట్లుగానే.. బీఆర్ఎస్ నేతలు వరుసపెట్టి మరీ కాంగ్రెస్ లోకి చేరిపోయారు.
ఇక.. బీఆర్ఎస్ మాత్రం వెళ్లిపొయిన నేతలు.. మరల కాళ్లుపట్టుకుని వెంటపడిన రానివ్వమంటూ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నుంచి 20 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లోకి రావడానికి రెడీగా ఉన్నారంటూ కొత్త రాగం మొదలుపెట్టారు. దీంతో ఇది ఒక్కసారిగా పొలిటికల్ సర్కిల్స్ లో రాజకీయా దుమారంగా మారిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో.. కాంగ్రెస్ లోనుంచి తిరిగి బీఆర్ఎస్ లోకి రావడమేంటని గుసగుసలు పెట్టుకుంటున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook