Bandi Sanjay: ప్రజలంతా బిచ్చగాళ్లుగా మారే ప్రమాదముంది.. సీఎం రేవంత్ పై మండిపడిన బండి సంజయ్..

Husnabad: రాజకీయ డ్రామాలు కట్టిపెట్టి హామీలన్ని ఎట్లా అమలు చేస్తావో ప్రజలకు చెప్పాలని  సీఎం రేవంత్ రెడ్డిపై బండి సంజయ్ ఫైర్ అయ్యారు . 2 నెలల్లో రూ.10 వేల కోట్లు అప్పు చేశారంటూ ఎద్దేవా చేశారు. 

Written by - Inamdar Paresh | Last Updated : Feb 26, 2024, 09:00 PM IST
  • మీకు, కేసీఆర్ కు తేడా ఏముంది?..
  • ఆరు గ్యారంటీల స్కీమ్ అమలు కాకపోవడంపై ఫైర్ అయిన బండి..
 Bandi Sanjay: ప్రజలంతా బిచ్చగాళ్లుగా మారే ప్రమాదముంది..  సీఎం రేవంత్ పై మండిపడిన బండి సంజయ్..

Bandi Sanjay Fires On CM Revanth Reddy And KCR: తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట కట్టుబడి వంద రోజుల్లోనే హామీలన్నీ అమలు చేసే దమ్ముందా?.. అంటూ బీజేపీ నేత బండి సంజయ్ సీఎం రేవంత్ పై మండిపడ్డారు. మలిదశ ప్రజాహిత యాత్రలో భాగంగా హుస్నాబాద్ నియోజకవర్గంలోని చిగురుమామిడి కేంద్రంలో బండి సంజయ్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.

Read More: Vaani Kapoor hot pics: హాట్ హాట్ అందాలతో మత్తెక్కిస్తోన్న వాణి కపూర్, పిక్స్ వైరల్

ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ...‘‘సీఎం గారు… మీకు, బీఆర్ఎస్ ప్రభుత్వానికి తేడా ఏముంది?.. 10 ఏళ్లలో రూ.5 లక్షల కోట్ల అప్పు తెస్తే… మీరు 2 నెలల్లోనే రూ.10 వేల కోట్ల అప్పు తెచ్చారని ఆరోపణలు చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన  హామీలను అమలు చేయకుండా ప్రజలను బీఆర్ఎస్ మోసం చేస్తే…. వంద రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేస్తానని మీరు మోసం చేయబోతున్నారంటూ ఎద్దేవా చేశారు. అరకొర హామీల అమలుతో ప్రజలను మోసం చేసి ఓట్లు దండుకోవాలనుకుంటున్నరు’’ అంటూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. 

తెలంగాణకు కేంద్రం నయా పైసా సాయం చేయలేదంటూ సీఎం చేసిన వ్యాఖ్యలను బండి సంజయ్ తప్పుపట్టారు.  తెలంగాణకు కేంద్రం ఏమీ ఇవ్వలేదని బుకాయిస్తారా?.. మోదీ పాలనలో తెలంగాణకు రూ.10 లక్షల కోట్లకుపైగా నిధులిచ్చిందని గుర్తుచేశారు.  అసలు రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల్లో పాలన సాగుతోందంటే మోదీ గారు ఇస్తున్న నిధుల పుణ్యమేనని అన్నారు. దమ్ముంటే ఆ నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. కాంగ్రెస్ పార్టీకి దమ్ముంటే ప్రజలకు ఇచ్చిన హమీ మేరకు వంద రోజుల్లోనే 6 గ్యారంటీలను అమలు చేసి చిత్తశుద్దిని నిరూపించుకోవాలని బండి సంజయ్  సవాల్ విసిరారు. 

ఇయాళ సీఎం గారు బీఆర్ఎస్ కు, బీజేపీకి ఏమీ తేడా లేదని అంటున్నడు… పదేళ్లలోనే వందేళ్లకు సరిపడా విధ్వంసం కేసీఆర్ చేశారని అన్నారు.  వంద రోజుల్లోనే మీరు 6 గ్యారంటీలన్నీ అమలు చేస్తామన్నారు. 75 రోజులు దాటిపోయాయి. ఎన్నికల కోడ్ రాబోతోంది?.. మరీ రూ.2 లక్షల రుణమాఫీ ఏమైంది? రైతు బంధు ఎకరాకు రూ.15 వేలు ఇస్తానన్నారు కదా ఏవి? మహిళలకు నెలనెలా రూ.2,500లు ఇస్తానన్నారు ఎందుకివ్వడం లేదు? ఆసరా పెన్షన్ రూ.4 వేలు ఇస్తానన్న హమీ ఎందుకు అమలు చేయడం లేదు? రూ.5 వందలకే గ్యాస్ సిలిండర్, 200 వందల యూనిట్ల ఉచిత కరెంట్ ఇచ్చి చేతులు దులుపేసుకోబోతున్నరు. మిగిలిన గ్యారంటీలన్నీ గాలికొదిలేసి ప్రజలను మోసం చేయబోతున్నరంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏకీ పారేశారు. 

కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అరకొర హామీలను రేషన్ కార్డులు ఉన్నోళ్లకే ఇస్తారట… గత 10 ఏళ్లుగా కొత్త రేషన్ కార్డుల కోసం 10 లక్షల కుటుంబాలు ఎదురు చూస్తున్నాయి. మరి వాళ్ల సంగతేమిటి. ఎవరు ప్రజలను మోసం చేస్తున్నారో, ఎవరు పేదలను ఆదుకుంటున్నారో ప్రజలు ఆలోచించాలి. మోదీ ప్రభుత్వం తెలంగాణలో 2 లక్షల 40 వేల ఇండ్లు ఇస్తే ఒక్క ఇల్లు కూడా కట్టివ్వకుండా మోసం చేసిన చరిత్ర రాష్ట్ర ప్రభుత్వానిది.

Read More: Cucumber: సమ్మర్ లో కీర దోసకాయలు ఎక్కువగా తింటున్నారా..?.. ఈ విషయాలు తెలుసుకొండి..

తెలంగాణలో 90 లక్షల కుటుంబాలకు ఉచిత బియ్యం అందిస్తోంది మోదీ ప్రభుత్వం. రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల్లో పాలన సాగుతోంది కేంద్రంవల్లే. గ్రామాలకు నిధులిస్తోందే మోదీ ప్రభుత్వం. అయినా ఏమీ ఇవ్వలేదని కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు డ్రామాలాడుతున్నయ్ అన్నారు. 5 వందల ఏళ్ల కల రామ మందిర నిర్మాణం. ఆ కలను సాకారం చేసిన మహానేత నరేంద్రమోదీ. రైతులకు ఎరువుల, కిసాన్ సమ్మాన్ నిధి పేరిట ఎకరాకు రూ.18 వేలు సబ్సిడీ అందిస్తున్న ఘనత మోదీ ప్రభుత్వానిదేనని రేవంత్ రెడ్డి కొనియాడారు. 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
 

Trending News