BJP Incharge Abhay Patil Serious On Hyderabad MP Candidate Madhavilatha: లోక సభ ఎన్నికల వేళ తెలంగాణ లో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అధిక సంఖ్యలో ఎంపీ సీట్లు గెలుచుకోవాలిన ప్రచారం నిర్వహిస్తుంది. దీనిలో భాగంగానే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన గెలుపు గుర్రాలకే టికెట్ లు ఇచ్చింది. మరోవైపు బీఆర్ఎస్ ఇటు తమ పార్టీలో నుంచి నేతలు వెళ్లిపోకుండా, జాగ్రత్త పడటంతో పాటు, ఎంపీ ఎన్నికలలో సీట్లు గెలుచుకుని మరోసారి సత్తాచాటాలని భావిస్తుంది. ఇక బీజేపీ పార్టీ తమదైన స్టైల్ లో ప్రచారం నిర్వహిస్తుంది. దేశంలో పీఎం మోదీ హ్యాట్రిక్ విజయం సాధించేలా పావుతు కదుపుతున్నారు. ఇక హైదరాబాద్ పై బీజేపీ స్పెషల్ ఫోకస్ పెట్టింది.
ముఖ్యంగా ఈసారి ఎన్నికలలో ఎలాగైన అసదుద్దీన్ ఓవైసీని ఓడించాలని టార్గెట్ గా మాధవీలతను అభ్యర్థిని బరిలోకి దింపింది. విరించి ఆస్పత్రి అధినేత మాధవీ లత పక్కా.. హిందుత్వ వాది. ఆమె అనేక కార్యక్రమాలలో హిందుత్వం గురించి, సనాతన ధర్మం గురించి అనర్గళంగా మాట్లాడుతున్నారు. అంతేకాకుండా.. కులమతాలకు అతీతంగా ప్రజలకు న్యాయం జరగాలంటూ కోరుకుంటున్నారు. ఆమె ఓల్డ్ సిటీలో ప్రచారం నిర్వహిస్తూ.. ఇటు మాస్ ప్రజలతో పాటు, క్లాస్ ప్రజల మనస్సులు కూడా గెలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు.
ఈ క్రమంలో ఇటీవల ఎంపీ అభ్యర్థి మాధవీ లత ప్రచారంలో లోకల్ బీజేపీ నాయకులను అంతగా పట్టించుకోవట్లేదని, కొద్దిమందితోనే కలిసి ప్రచారం చేస్తున్నారని బీజేపీ అధినాయత్వానికి ఫిర్యాదులు వెళ్లాయంట. యూట్యూబ్, ఛానెల్స్ ఇంటర్వ్యూలు ఇవ్వడంలోనే మాధవీలత ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారంట. ఈ క్రమంలోనే తెలంగాణ బీజేపీ ఇన్ చార్జీ అభయ్ పాటిల్ కూడా దీనిపై సీరియస్ గా స్పందించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అభయ్ పాటిల్ ఎప్పటి కప్పుడు తెలంగాణ బీజేపీ నేతలు చేస్తున్న ప్రచారం, ప్రజల నుంచి వీరికి వస్తున్న రెస్పాన్స్ లను బీజేపీ అధినాయకత్వానికి చేరవేస్తున్నారంట. అంతే కాకుండా.. బీజేపీ నేతలను ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ, ప్రచారంలో లోకల్ బీజేపీ నేతలను కలుపుకుని పోవాలని కూడా సూచిస్తున్నారంట.
Read More: Loksabha Elections 2024: గులాబీ బాస్ కేసీఆర్ కు మరో బిగ్ షాక్.. నోటీసులు జారీ చేసిన ఎన్నికల కమిషన్..
అదే విధంగా కేంద్రంలో ఉన్న బీజేపీ ఈ పదేళ్లపాటు ప్రజల కోసం ప్రవేష పెట్టిన పథకాలు, ఇతర దేశాలతో కుదుర్చుకున్న ఒప్పందాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా చూడాలన్నారు. టెర్రరిస్టులు, బాంబుదాడుల వంటివి లేకుండా చేసిన అనేక ఘటనలను కూడా చెప్పాలన్నారు. ఇక అమెరికా, ఫ్రాన్స్, చైనాలాంటి దేశాలు కూడా .. భారత్ వైపు చూడాలంటేనే ఒకసారి ఆలోచించే స్థానంలో మోదీ దేశాన్ని ఉంచారని, ఇవన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని, అభయ్ పాటిల్ తెలంగాణ బీజేపీ నాయకులకు ఎప్పటికప్పుడు సూచిస్తున్నారంట. దీనిలో భాగంగానే.. ఎంపీ అభ్యర్థి మాధవీ లతకు యూట్యూబ్ లో కన్పించడం ఆపేసి, ప్రజల్లోకి వెళ్లాలని హితవు పలికారంట.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitterమాధవీలతకు క్లాస్ పీకిన బీజేపీ అధి నాయకత్వం.. ప్రజల్లోకి వెళ్తేనే ఆదరణ ఉంటుందంటూ బ్రైన్ వాష్.