Telangana Election Results 2023: దక్షిణాదిన కాంగ్రెస్ మరో రాష్ట్రాన్ని కైవసం చేసుకుంటోంది. కొన్నాళ్ల క్రితం కర్ణాటకను బీజేపీ నుంచి చేజిక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తెలంగాణను బీఆర్ఎస్ నుంచి లాక్కుంటోంది. బీఆర్ఎస్ ప్రభుత్వ వ్యతిరేకత ఏడుగురు మంత్రుల ఓటమికి కారణమైంది. పూర్తి వివరాలు మీ కోసం..
తెలంగాణలో పదేళ్ల తరువాత కాంగ్రెస్ పార్టీ అధికారంలో రానుంది. తెలంగాణ ఎర్పడక ముందు చివరిసారిగా 2004, 2009లో వరుసగా రెండుసార్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. 2014లో తెలంగాణ ఏర్పడుతూనే వరుసగా రెండుసార్లు బీఆర్ఎస్ అధికారంలో వచ్చింది. కాంగ్రెస్ పార్టీ దాదాపుగా అడుగంటకుపోయిన పరిస్థితి. అదే కాంగ్రెస్ పార్టీ 2023 ఎన్నికల్లో అనూహ్యంగా పుంజుకుని ఏకంగా అధికారం చేజిక్కించుకోనుంది. ఈ ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ గజ్వేల్, కామారెడ్డి నుంచి పోటీ చేయగా కామారెడ్డిలో వెనుకంజలో ఉండటం గమనార్హం.
ఏడుగురు మంత్రులు ఓటమి పాలయ్యారు. వీరిలో ఆర్అండ్బి మంత్రి నిరంజన్ రెడ్డి, పంచాయితీ రాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, పర్యాటక,ఎక్స్చైజ్ మంత్రి శ్రీనివాస్ గౌడ్, దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్, సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఉన్నారు. మంత్రుల ఓటమితో బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం, పాలకుర్తి, నిర్మల్, బాల్కొండ, ధర్మపురి, వనపర్తి, మహబూబ్‌నగర్ స్థానాలు కోల్పోవల్సి వచ్చింది.
బీఆర్ఎస్ ప్రభుత్వంపై వ్యతిరేకత పరాకాష్ఠలో ఉండటమే మంత్రులు సైతం ఓడిపోవడానికి కారణమైంది. అటు బీఆర్ఎస్ నాయకత్వం కూడా ప్రభుత్వ వ్యతిరేకతను పట్టించుకోకుండా పాతవారినే కొనసాగించడం కూడా మరో ప్రధాన కారణంగా తెలుస్తోంది. బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పినట్టుగా సంక్షేమ పథకాలు చివరి వరకూ కాకపోయినా అందరికీ చేరకపోవడం వల్ల మంత్రులు సైతం ఓడిపోయారు. అదే సమయంలో మంత్రుల్లో పేరుకుపోయిన అవినీతి అన్నింటికీ మించిన కారణంగా ఉంది.
Also read: Telangana Election Results 2023: ప్రభుత్వ ఏర్పాటు దిశగా కాంగ్రెస్, సీఎం అభ్యర్ధి ఎవరు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook