Teenmar Mallanna: మునుగోడులో తీన్మార్ మల్లన్న ప్రెస్‌మీట్, కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్‌పై తీవ్ర వ్యాఖ్యలు

Teenmar Mallanna: టీఆర్ఎస్ నేతలపై, మంత్రి కేటీఆర్‌పై తీన్మార్ మల్లన్న తీవ్రమైన వ్యాఖ్యుల చేశారు. మరో మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను తాగుబోతుల మంత్రిగా సంబోధించారు. మునుగోడులో తీన్మార్ వ్యాఖ్యలు సంచలనంగా మారుతున్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 11, 2022, 08:45 PM IST
Teenmar Mallanna: మునుగోడులో తీన్మార్ మల్లన్న ప్రెస్‌మీట్, కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్‌పై తీవ్ర వ్యాఖ్యలు

Teenmar Mallanna: టీఆర్ఎస్ నేతలపై, మంత్రి కేటీఆర్‌పై తీన్మార్ మల్లన్న తీవ్రమైన వ్యాఖ్యుల చేశారు. మరో మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను తాగుబోతుల మంత్రిగా సంబోధించారు. మునుగోడులో తీన్మార్ వ్యాఖ్యలు సంచలనంగా మారుతున్నాయి.

తీన్మార్ మల్లన్న ఛానెల్.. కో యాంకర్ సుదర్శన్ గౌడ్‌పై జరిగిన దాడిపై తీన్మార్ మల్లన్న స్పందించారు. మునుగోడులో ప్రెస్‌మీట్ ద్వారా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మంత్రి కేటీఆర్, సుదర్శన్ గౌడ్‌లే ఈ దాడి చేయించారని ఆరోపించారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను తాగుబోతుల మంత్రిగా అభివర్ణించారు. ప్రజా గొంతును, ప్రశ్నించే వ్యక్తుల గొంతును నొక్కేందుకు టీఆర్ఎస్ నేతలు ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. 

మంత్రి శ్రీనివాస్ గౌడ్ లుచ్చా పనులు మానుకోవాలని..అసలతడు నిజమైన గౌడేనా అని తీన్మార్ మల్లన్న ప్రశ్నించారు. పోలీసులు ఖాకీ బట్టలేసుకున్నా..గులాబీ రంగు ధరించిన టీఆర్ఎస్ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. మహబూబ్‌నగర్ ఎస్‌పి వ్యవహారం సిగ్గుచేటను వ్యాఖ్యానించారు. 

మునుగోడులో సభ

రేపు అంటే సెప్టెంబర్ 12వ తేదీన మునుగోడులో బహిరంగ సభ నిర్వహించనున్నట్టు తీన్మార్ మల్లన్న తెలిపారు. మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాల అభిమానులు తప్పకుండా పాల్గొనాలని పిలుపునిచ్చారు. మనుగోడులో ప్రతి గడపకు తిరుగుతూ..ప్రజల్ని చైతన్యం చేస్తానన్నారు. మహబుబ్‌నగర్‌లో తనను డిస్ట్రబ్ చేసినందుకు..మునుగోడులో టీఆర్ఎస్ పార్టీని చెల్లాచెదురు చేస్తానన్నారు. మునుగోడులో టీఆర్ఎస్ పార్టీకు డిపాజిట్ లేకుండా చేస్తానని సవాలు విసిరారు. నెలరోజులు మునుగోడులోనే ఉంజి..టీఆర్ఎస్ పార్టీని బొంద పెడతానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల నోటిఫికేషన్ అనంతరం భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తానన్నారు తీన్మార్ మల్లన్న.

Also read: Thummala Nageswara Rao Politics: తుమ్మల పాలిటికల్ స్ట్రాటెజీ.. పాలేరు ఫ్యూచర్ పాలిటిక్స్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News