Students burning trains Videos found at Secunderabad Protest: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో జరిగిన అల్లర్ల ఘటనపై దర్యాప్తు వేగవంతంగా కొనసాగుతోంది. ఈ కేసులో రోజుకో కొత్త విషయాలు బయటికి వస్తున్నాయి. ఈ క్రమంలోనే రైల్వే స్టేషన్‌లో విధ్వంసానికి సంబంధించిన కొత్త ఆధారాలు లభించాయి. రైళ్లకు నిప్పుపెట్టిన కీలక వీడియోలు పోలీసుల చేతికి చిక్కాయి. వీడియోలో రైళ్లను తగలబెట్టిన వారిని పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
విధ్వంసకారులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లోని రైళ్లను, ఇతర సామాగ్రిని ఎలా తగలబెట్టారో వీడియోలలో స్పష్టంగా కనబడుతోంది. ఓ వీడీయోలో కొందరు యువకులు స్టేషన్‌లో లిఫ్టు, ట్రైన్ డోరు, ఏసీ కోచ్ విండోలను పగలగొట్టడం కనిపిస్తోంది. మరో వీడియోలో దుండగులు రైళ్లలోకి ఎక్కి పేపర్లకు నిప్పంటించి సీట్లపై పెట్టారు. దాంతో మంటలు ముందుగా సీట్లకు అందుకుని రైలు మొత్తాన్ని అలముకున్నాయి. ఈ వీడియోల ఆధారంగా ఈ ఘటనకు పాల్పడ్డారో క్లియర్‌గా తెలుస్తోంది. చాలా మంది యువకులను పోలీసులు ఇప్పటికే గుర్తించారు. వీరిపై అభియోగాలు రుజువైతే మరణశిక్ష లేదా యావజ్జీవ కారాగార శిక్ష పడే అవకాశాలున్నాయట.
సికింద్రాబాద్ అల్లర్ల కేసు దర్యాప్తు ముమ్మరం చేసిన రైల్వే పోలీసులు కీలక ఆధారాలను సేకరించారు. ఈ కేసును సిట్‌కు బదిలీ చేశారు. రిమాండ్ రిపోర్ట్‌లో పలు కీలక అంశాలను చేర్చారు. మెడికల్ ఫిట్‌నెస్ సాధించి ఆర్మీ ఉద్యోగాల కోసం చూస్తున్న 56 మందిని నిందితులుగా చేర్చారు. పలు డిఫెన్స్ అకాడమీల పాత్ర ఉన్నట్టు కూడా గుర్తించారు. మొత్తం 18 మందిని ప్రత్యక్ష సాక్షులుగా చేర్చి A-1 మధుసూధన్‌ను అరెస్ట్ చేశారు. అకాడమీల నిర్వహకులు వాట్సాప్ గ్రూపుల్లో అల్లర్లకు పెద్ద ఎత్తున ప్లాన్ చేసినట్టు గుర్తించారు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో 17వ తేదీన జరిగిన విధ్వంసంలో ఆవుల సుబ్బారావు మద్దతు ఇస్తున్నాడని కొంతమంది విద్యార్థులు చర్చించుకున్నారని పేర్కొంది. సాయి డిఫెన్స్ అకాడమీకి చెందిన ఆవుల సుబ్బారావు, మరొకరు ఆందోళనకారులకు సహకరించినట్టు రిమాండ్ రిపోర్టులో ఉంది. ఆందోళనకారులకు సుబ్బారావు పలు విధ్వంసక వస్తువులు అందించినట్టు పోలీసులు తెలిపారు. ఉత్తరాదిలో జరిగిన విధ్వంసాన్ని చూసి స్ఫూర్తి పొందినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.
Also Read: ప్రైవేట్ పాఠశాలలో చదివితే.. మీ పిల్లలకు ఎలాంటి సర్టిఫికేట్స్ ఇవ్వం! తల్లిదండ్రులకు హెచ్చరిక
Also Read: David Warner Record: స్టంపౌటైన డేవిడ్ వార్నర్.. వన్డే క్రికెట్ చరిత్రలో రెండో ఆటగాడిగా రికార్డు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.