Hyderabad Traffic Violations: ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ఉల్లంఘనలకు పాల్పడే విషయంలో తగ్గేదేలె అన్నట్టు వాహనాలు నడిపే వాహనదారులకు జరిమానా విధించి కళ్లెం వేసే విషయంలో తాము కూడా తగ్గెదేలే అంటున్నారు ట్రాఫిక్ పోలీసులు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మంగళవారం నుండే స్టాప్‌లైన్ ఉల్లంఘనలకు పాల్పడే వారిపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ టి శ్రీనివాస్ రావు స్పష్టంచేశారు. విప్రో సర్కిల్ వద్ద మంగళవారమే శ్రీనివాస రావు ఈరోజు ఈ స్పెషల్ డ్రైవ్‌ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస రావు మాట్లాడుతూ... సైబరాబాద్ పోలీస్ కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర ఆదేశాలతో ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద రోడ్డు క్రాస్ చేసే పాదాచారుల భద్రత దృష్ట్యా నవంబర్ 1వ తేదీ నుంచి స్టాప్‌లైన్ ఉల్లంఘనలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ట్రాఫిక్ జంక్షన్ల వద్ద సిగ్నల్ పడిన తర్వాత ఎవరైతే స్టాప్ లైన్ దాటి జీబ్రా క్రాసింగ్ లేదా అంతకంటే ముందు వాహనాలు ఆపుతారో.. వారిపై మోటార్ వెహికిల్ యాక్ట్ సెక్షన్ 177 ప్రకారం 100 రూపాయల జరిమానా విధించడం ఖాయం అన్నారు.
వాహనదారులు ఎలాగైతే ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ స్టాప్ లైన్ వద్దే తమ వాహనాలు నిలపాలో.. అలాగే పాదాచారులు కూడా ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ జీబ్రా క్రాసింగ్ వద్దనే రోడ్డు దాటాలని, ఎక్కడపడితే అక్కడ రోడ్డు దాటి ఇబ్బందులు కొనితెచ్చుకోవద్దని సూచించారు. పాదచారుల భద్రతే తొలి ప్రాధాన్యతగా దృష్టిలో పెట్టుకుని ఈ స్టాప్ లైన్ ఉల్లంఘనులపై స్పెషల్ ఫోకస్ పెట్టినట్టు శ్రీనివాస్ రావు తేల్చిచెప్పారు.
సైబరాబాద్ లో "స్టాప్ లైన్ ఉల్లంఘన"ల పై స్పెషల్ డ్రైవ్. pic.twitter.com/0efSQrSzYG
— CYBERABAD TRAFFIC POLICE సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ (@CYBTRAFFIC) November 1, 2022
రోడ్డుపైకి వచ్చే వాహనదారుల భద్రత కోసం, పాదచారుల భద్రత కోసం ఎన్నో ట్రాఫిక్ రూల్స్ తీసుకొస్తున్నప్పటికీ.. ఆ నిబంధనలను పాటించకుండా ఉల్లంఘించడం వల్లే అనేక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నట్టు ఇప్పటికే అనేక సందర్భాల్లో నిరూపితమైన విషయం తెలిసిందే. ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ ధరించడం తప్పనిసరి, కారులో ప్రయాణించే వారు సీటు బెల్ట్ తప్పనిసరి, ఓవర్ స్పీడ్ వెళ్లకుండా చర్యలు, రాంగ్ రూట్ డ్రైవింగ్ నివారణ, ట్రాఫిక్ జంక్షన్స్ వద్ద రెడ్ లైట్ లాంటి ట్రాఫిక్ నిబంధనలు కూడా వాహనదారులతో పాటు పాదచారుల సేఫ్టీ కోసం తీసుకొచ్చిన నిబంధనలే అయినప్పటికీ.. ఆయా నిబంధనల ఉల్లంఘనల వల్లే పలుసార్లు రోడ్డు ప్రమాదాల్లో ప్రాణ నష్టాన్ని నివారించలేకపోతున్నామని గ్రహించిన పోలీసులు తాజాగా స్టాప్ లైన్ నిబంధనపై దృష్టిసారించారు.
Also Read : Revanth Reddy: మునుగోడును దత్తత తీసుకుంటా.. కేటీఆర్ బాటలోనే రేవంత్ రెడ్డి ?
Also Read : Munugode Bypoll: రణరంగంగా మారిన మునుగోడు.. బీజేపీ ఎమ్మెల్యే ఈటల కారుపై రాళ్ల దాడి
Also Read : KTR TARGET RAHUL GANDHI: కేటీఆర్, రేవంత్ రెడ్డి మధ్య ట్విట్టర్ వార్.. ఓ రేంజ్ లో తిట్టుకున్నారుగా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి