బస్సుపై రాళ్ల దాడి.. భయాందోళనలో ప్రయాణికులు

బస్సుపై రాళ్ల దాడి.. భయాందోళనలో ప్రయాణికులు

Last Updated : Oct 19, 2019, 01:05 PM IST
బస్సుపై రాళ్ల దాడి.. భయాందోళనలో ప్రయాణికులు

నిర్మల్‌ టౌన్‌: రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ బంద్ ఉధృతంగానే జరుగుతున్నప్పటికీ.. అక్కడక్కడా స్వచ్చందంగా విధుల్లో చేరేందుకు వచ్చిన తాత్కాలిక డ్రైవర్లు, తాత్కాలిక కండక్టర్లు బస్సులు తీసే ప్రయత్నం చేస్తున్నారు. అలా నిర్మల్‌ జిల్లా సారంగపూర్‌లో రోడ్డెక్కిన ఓ ఆర్టీసీ బస్సుపై గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లు విసిరి దాడికి పాల్పడ్డారు. బస్సు ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రం నుంచి నిర్మల్‌ వెళ్తుండగా నేరడిగొండ శివారులో రాళ్ల దాడి జరిగింది. దుండగుల దాడిలో బస్సు వెనుక వైపు ఉన్న అద్దాలు పగిలిపోయాయి. ఊహించని పరిణామానికి బస్సులో ఉన్న 40 మంది ప్రయాణికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని అక్కడి నుంచి బయటపడ్డారు.

Trending News