Telangana High Court: మన ఊరు-మన బడి టెండర్లపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. తదుపరి కోర్టు ఆదేశాలు వచ్చే వరకు టెండర్ల ప్రక్రియను పూర్తి చేయొద్దని ఆదేశించింది. దీంతో తెలంగాణ ప్రభుత్వానికి షాక్ తగిలినట్లు అయ్యింది. మన ఊరు- మన బడి టెండర్లపై విచారణ చేపట్టిన కోర్టు ఇరుపక్షాల వాదనలను స్వీకరించింది. ఇటీవల ఎలగంట్ మేథడక్స్ సంస్థ టెండర్‌ను దక్కించుకుంది.
ఇది చట్ట విరుద్ధమంటూ కేంద్రీయ బండార్ జెనిత్ మెటప్లస్ట్ ప్రైవేట్ లిమిటెడ్, V3 ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ పిటిషన్ దాఖలు చేసింది. టెండర్ నిబంధనల్లో అన్ని అర్హతలు తమకు ఉన్నాయని కోర్టులో పిటిషనర్లు వాదించారు. తమకే టెండర్లు దక్కాలని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. ఇరుపక్షాల వాదనలు స్వీకరించిన కోర్టు టెండర్ల ప్రక్రియను పూర్తి చేయొద్దని స్పష్టం చేసింది. పిటిషన్‌లో పాఠశాల విద్యా శాఖ కార్యదర్శి, టీఎస్ డబ్ల్యూఐ డీసీ, చీఫ్ ఇంజనీర్, ఎలగంట్ మేథడాక్స్ సంస్థ ప్రతివాదులుగా ఉన్నారు. తదుపరి విచారణ ఈనెల 11కు వాయిదా వేసింది కోర్టు.
Also read:Vk Naresh: నటుడు నరేష్ ముగ్గురు భార్యలు ఎవరు? వారి బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?
Also read:Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో రెయిన్ అలర్ట్..కీలక సూచనలు చేసిన వాతావరణ శాఖ..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter , Facebook
Telangana High Court: హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి షాక్..మన ఊరు-మన బడి టెండర్లపై కీలక ఆదేశాలు..!
మన ఊరు-మన బడి టెండర్లపై విచారణ
తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు
ప్రతివాదులుగా అధికారులు