/telugu/photo-gallery/puri-jagannadh-explains-about-emotional-blockmail-in-puri-musings-pa-180794 Puri Jagannadh: వాళ్లు అమాయకులుగా కన్పించే క్రిమినల్స్..  షాకింగ్ కామెంట్స్ చేసిన పూరీ జగన్నాథ్.. స్టోరీ ఏంటంటే..? Puri Jagannadh: వాళ్లు అమాయకులుగా కన్పించే క్రిమినల్స్.. షాకింగ్ కామెంట్స్ చేసిన పూరీ జగన్నాథ్.. స్టోరీ ఏంటంటే..? 180794

Shabbir Ali Supports Revanth Reddy: కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు, జూనియర్లు అని వినిపిస్తున్న మాటలపై ఆ పార్టీ అగ్రనేత, మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఘాటుగా స్పందించారు. జనవరి 26 నుండి హాత్ సే హాత్ జోడో కార్యక్రమం విజయవంతం చేయడం కోసం కలిసికట్టుగా పోరాడదాం అని చెబుతూ షబ్బీర్ అలీ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నా జీవితంలో నేనెప్పుడు క్రమశిక్షణతోనే ఉన్నాను. నాకన్నా ముందు ఉన్నవారు డిసిప్లేన్ గురించి చెబుతున్నారు. గీతారెడ్డి, నేను, ఇంకొంతమందిమి ఒకేసారి మంత్రులం అయ్యాం అని గుర్తుచేసుకున్నారు. జానారెడ్డి పదవుల్లో నాకన్నా కొంచెం సీనియర్ కాగా.. నేను పార్టీలో జానారెడ్డి కన్నా సీనియర్‌ని. అయితే మాత్రం ఈ సీనియర్లు, జూనియర్లు అనే పంచాయతీ ఏంటి అని షబ్బీర్ అలీ ప్రశ్నించారు.

పార్టీల ఈ మధ్య జూనియర్ , సీనియర్ అనే మాటలు వినిపిస్తున్నాయి. నాయకత్వం తయారయ్యేది కాంగ్రెస్ పార్టీలోనే అనే విషయం మర్చిపోకండి. కాంగ్రెస్ పార్టీ అనేది నాయకులను తయారు చేసే ఒక ఫ్యాక్టరీ లాంటిది. పార్టీని పార్టీలాగే చూడాలి కానీ పార్టీలో సీనియర్లు , జూనియర్లు అనే పంచాయతీ బంద్ చేసి అందరూ కలిసికట్టుగా పని చేయండి అంటూ తోటి నేతలకు హితవు పలికారు. మా లైఫ్ అంత కాంగ్రెస్ పార్టీ అధిష్టానం గీసిన గీత దాటలేదు.. నేను నా చిన్నతనంలో ఉన్నప్పుడే రాజీవ్ గాంధీ పిలిచి గుర్తించారు.. పార్టీ టికెట్ ఇచ్చారు.. నేను ఎంతోమందితో కలిసి పని చేసినప్పుడు కానీ లేదా, క్యాబినెట్‌లో మంత్రిగా చేసినప్పుడు కానీ ఏనాడూ పార్టీకి సంబంధించిన ఇంటర్నల్ కాంట్రవర్సీని బయట మాట్లాడలేదు అని సున్నితంగా చెబుతూనే.. అప్పుడప్పుడు పార్టీపై ధిక్కార స్వరం వినిపిస్తున్న పలువురు నేతలకు పరోక్షంగా చురకలు అంటించారు. 

ఏది ఏమైనా ఇక నుండి అందరం కలిసికట్టుగా పార్టీకి పనిచేసి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేద్దాం అని షబ్బీర్ అలీ వ్యాఖ్యానించారు. బుధవారం జరిగిన ఒక్కరోజు శిక్షణ తరగతులు కార్యక్రమంలో భాగంగా షబ్బీర్ అలీ ఈ వ్యాఖ్యలు చేశారు. షబ్బీర్ అలీ చేసిన వ్యాఖ్యలు కొంతమంది సీనియర్లకు మింగుడుపడనప్పటికీ.. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేధాలు, సీనియర్లు, జూనియర్లు అంటూ జరుగుతున్న కొట్లాటలతో మద్దతు కొరవడిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి షబ్బీర్ అలీ చేసిన వ్యాఖ్యలు ఒకరకంగా ఎంతో బలాన్నిచ్చాయనే చెప్పుకోవచ్చు.

ఇది కూడా చదవండి : Revanth Reddy: చంద్రబాబుకు మీడియా మొత్తం సపోర్ట్ చేసినా.. వైఎస్సార్‌ను ఏం చేయలేకపోయారు: రేవంత్ రెడ్డి

ఇది కూడా చదవండి : ATM Withdrawal: ఈ ఏటీఎం నుంచి రూ.500 విత్ డ్రా చేస్తే రూ.2500 చేతికి.. ఎగబడ్డ జనం

ఇది కూడా చదవండి : Renjarla Rajesh News: రేంజర్ల రాజేష్‌కి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Section: 
English Title: 
shabbir ali interesting comments on telangana congress leaders
News Source: 
Home Title: 

Shabbir Ali, Revanth Reddy: పార్టీలో సీనియర్లు , జూనియర్లు పంచాయతీ ఏంది: షబ్బీర్ అలీ

Shabbir Ali, Revanth Reddy: పార్టీలో సీనియర్లు , జూనియర్లు పంచాయతీ ఏంది: షబ్బీర్ అలీ
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
Shabbir Ali, Revanth Reddy: పార్టీలో సీనియర్లు , జూనియర్లు పంచాయతీ ఏంది: షబ్బీర్ అలీ
ZH Telugu Desk
Publish Later: 
No
Publish At: 
Thursday, January 5, 2023 - 01:57
Request Count: 
41
Is Breaking News: 
No