Saidabad Girl Case: సైదాబాద్‌ బాలిక కేసులో కీలక నిర్ణయం, నిందితుడిని పట్టించిన వారికి పెద్ద మొత్తంలో రివార్డ్

Singareni Colony Girl Incident : ఈ కేసును తెలంగాణ పోలీసులు, ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకున్నారు. ఈ విషయంపై హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అంజనీ కుమార్‌ తాజాగా సమీక్ష నిర్వహించారు. నిందితుడు రాజు ఆచూకీ తెలిపిన వారికి రివార్డ్‌ ప్రకటించారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 14, 2021, 09:39 PM IST
  • సైదాబాద్‌ చిన్నారి అత్యాచారం, హత్య కేసులో సీపీ కీలక నిర్ణయం
  • నిందితుడు రాజు ఆచూకీ తెలిపిన వారికి రివార్డ్‌
  • ఆనవాళ్లు తెలిపిన పోలీసులు
Saidabad Girl Case: సైదాబాద్‌ బాలిక కేసులో కీలక నిర్ణయం, నిందితుడిని పట్టించిన వారికి పెద్ద మొత్తంలో రివార్డ్

Singareni Colony Girl Incident : సైదాబాద్‌ చిన్నారి అత్యాచారం, హత్య కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ప్రధాన అంశంగా మారింది. ఈ కేసును తెలంగాణ పోలీసులు, ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకున్నారు. ఈ విషయంపై హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అంజనీ కుమార్‌ (Anjani Kumar) తాజాగా సమీక్ష నిర్వహించారు. నిందితుడు రాజు (Accused Raju) ఆచూకీ తెలిపిన వారికి రివార్డ్‌ ప్రకటించారు. 10 లక్షల రివార్డ్‌ (10 lakhs reward) ఇస్తామని హైదరాబాద్‌ పోలీసులు ప్రకటించారు. 

ఇక సైదాబాద్‌ సింగరేణి కాలనీలో ఆరేళ్ల బాలికను రాజు అనే వ్యక్తి అత్యాచారం చేసి హత్య చేసిన విషయం తెలిసిందే. ఘటన జరిగినప్పటి నుంచి నిందితుడు పరారీలో ఉన్నాడు. దీంతో తెలంగాణ పోలీసు యంత్రాంగం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతోంది. 

Also Read : Post Office Deposit Schemes: పోస్టాఫీసు డిపాజిట్ పథకాల్లో కనక వర్షం 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిందితుడి ఆనవాళ్లు.. నిందితుడి ఎత్తు సుమారు 5.9 అడుగులు. పెద్ద జుట్టుకు రబ్బర్‌ బ్యాండ్‌ వేసుకుంటాడు. వయసు సుమారు 30 ఏళ్లు. అతని రెండు చేతులపై మౌనిక అనే టాటూ ఉంటుంది. సైదాబాద్‌లో జరిగిన బాలిక హత్యాచారం కేసులో (Saidabad girl rape case) నిందితుడు రాజు ఆచూకీ తెలిస్తే 9490616366, 9490616627 నెంబర్లకు ఫోన్ చేయాలని పోలీసులు సూచించారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News