Fahadh Faasil: పుష్ప2 విలన్ పై కేరళ పోలీసులు సీరియస్ అయ్యారు. ఆయనపై సుమోటోగా కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనీట్ తాజాగా దీనిపై స్పందించారు.
పుష్ప సినిమాలో కాసేపు కన్పించిన కూడా పుష్ప విలన్ ఫహద్ ఫాజిల్ తనదైన స్టైల్ లో మంచి క్రేజ్ ను సంపాదించుకున్నారు.ఈ నేపథ్యంలో యాక్టింగ్ కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఇదిలా ఉండగ.. ఇటీవల ఫాహద్ ఫాజిల్ అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో ఫహద్ ఫాజిల్ మూవీ ప్రస్తుతం వార్తలలో నిలిచింది. భారీ అంచనాల మధ్య రూపొందుతున్న పుష్ప 2 చిత్రంలో ఫహద్ ఫాజిల్ కీ రోల్ ప్లే చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా.. ఫహాద్ పోలీసు కేసుల్లో ఇరుక్కున్నారు. ఈ క్రమంలో కేరళ మానవ హక్కుల సంఘం, పుష్ప 2 విలన్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాకుండా.. అతడిపై సుమోటోగా కేసు కూడా నమోదయ్యింది.
మలయాళీ హీరో ఫహాద్ ఫాజిల్.. ఇటీవల పింకేలీ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ అంగమలైలోని ఎర్నాకులం ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగింది. గురువారం రాత్రంతా యూనీట్ షూటింగ్ చేయడంవల్ల అక్కడి రోగులంతా ఇబ్బందులు పడినట్లు సమాచారం. ఎమర్జెన్సీ రూంలోనూ నార్మల్ గా సాధారణ రోగులకు కూడా అలోవ్ చేయరు. అలాంటిది అత్యవసరం విభాగంలో షూటింగ్ చేయడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది.
ఈ ఘటన కాస్త ఉన్నతాధికారుల వరకు వెళ్లింది. దీనిపై ఎర్నాకులం జిల్లా వైద్యాధికారి బీనా కుమారి సీరియస్ అయ్యారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలనికూడా ఆదేశించారు. అంతే కాకుండా.. అసలు ఎవరు దీనికి అనుమతి ఇచ్చారంటూ కూడా ఫైర్ అయ్యారు. ఈ విషయంపై వారం రోజుల్లో పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశించారు.
ఒకవైపు రోగులకు ట్రీట్మెంట్ జరుగుతుండగా.. కొందరు రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని అక్కడి వారు తమ బాధలను చెప్పుకున్నారు. ఆసుపత్రిలో రాత్రంతా సినిమా యూనీట్ వాళ్లు.. నానా హంగామా చేశారని అక్కడున్న రోగులు చెబుతున్నారు.
ఇదిలా ఉండగా.. ఈ ఆరోపణలను చిత్ర యూనిట్ ఖండించింది. తమ షూటింగ్ కోసం..ఆసుపత్రిలో వారికి రూ.10 వేలు చెల్లించామని వెల్లడించింది. అయితే ఈ ఘటనపై కేరళ మానవ హక్కుల సంఘం నిర్మాత ఫహాద్ ఫాజిల్ పై కేసు పెట్టినట్లు సమాచారం. అయితే ఈ విషయంపై ఇప్పటివరకు ఫహాద్ స్పందించలేదు.