RS Praveen Kumar: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వీఆర్ఎస్ దరఖాస్తుకు ప్రభుత్వం ఆమోదం

RS Praveen Kumar's VRS application approved: హైదరాబాద్: తెలంగాణ సాంఘిక, గిరిజన సంక్షేమ గురుకులాల సొసైటీ కార్యదర్శి ఆర్‌.ఎస్‌. ప్రవీణ్‌ కుమార్‌ స్వచ్ఛంద పదవీ విరమణ (VRS) దరఖాస్తుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇదిలావుంటే, సాంఘిక సంక్షేమ గురుకులాల సొసైటీ కార్యదర్శిగా తన స్థానంలో నియమితులైన రొనాల్డ్ రోస్‌కు (IAS Ronald Rose) ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ శుభాకాంక్షలు తెలిపారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 21, 2021, 01:40 AM IST
RS Praveen Kumar: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వీఆర్ఎస్ దరఖాస్తుకు ప్రభుత్వం ఆమోదం

RS Praveen Kumar's VRS application approved: హైదరాబాద్: తెలంగాణ సాంఘిక, గిరిజన సంక్షేమ గురుకులాల సొసైటీ కార్యదర్శి ఆర్‌.ఎస్‌. ప్రవీణ్‌ కుమార్‌ స్వచ్ఛంద పదవీ విరమణ (VRS) దరఖాస్తుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. సోమవారం ఐపీఎల్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వాల్యుంటరీ రిటైర్మెంట్‌కి దరఖాస్తు చేసుకోగా.. మంగళవారమే ప్రభుత్వం ఆయన పదవీ విరమణకు అనుమతిస్తూ అధికారికంగా ఓ నోటిఫికేషన్ జారీ చేసింది. 

ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వీఆర్ఎస్ దరఖాస్తు విషయంలో మూడు నెలలు ముందుగా ప్రభుత్వానికి నోటీస్ ఇవ్వాలనే నిబంధనను సైతం ప్రభుత్వం సడలించింది. ప్రవీణ్ కుమార్ స్వచ్ఛంద పదవీ విరమణకు (VRS) ఆమోదం తెలిపిన క్రమంలో ఆయనను విధుల నుంచి రిలీవ్ చేయడంతో పాటు ఆయన స్థానంలో ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి రొనాల్డ్ రోస్‌కు ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది. 

Also read : Delta virus transmits through air: డెల్టా వైరస్ గాలి ద్వారా సోకుతుంది

ఇదిలావుంటే, సాంఘిక సంక్షేమ గురుకులాల సొసైటీ కార్యదర్శిగా తన స్థానంలో నియమితులైన రొనాల్డ్ రోస్‌కు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ శుభాకాంక్షలు (RS Praveen Kumar) తెలిపారు. సాంఘిక సంక్షేమ గురుకులాల సొసైటీ కార్యదర్శిగా ఉద్యోగాన్ని అనుక్షణం ఆస్వాదిస్తారని పేర్కొంటూ రొనాల్డ్ రోస్‌కు (IAS Ronald Rose) ట్విటర్ ద్వారా ప్రవీణ్ కుమార్ శుభాకాంక్షలు తెలియజేశారు.

Also read: YS Sharmila: ఊపిరి ఉన్నంత వరకు ప్రజల కోసం: వైఎస్‌ షర్మిల

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News