రామ్ గోపాల్ వర్మ నెక్ట్స్ టార్గెట్ తెలంగాణ సీఎం కేసీఆర్ ?

                            

Last Updated : Mar 26, 2019, 09:14 PM IST
రామ్ గోపాల్ వర్మ నెక్ట్స్ టార్గెట్ తెలంగాణ సీఎం కేసీఆర్ ?

లక్ష్మీస్ ఎన్టీఆర్ పేరుతో ఎన్టీఆర్ బయోపిక్ రెడీ చేసిన సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ.. ఇప్పుడు మరో క్రేజీ బయోపిక్ పై దృష్టి  సారించారు. ఈ క్రమంలో వర్మ నెక్ట్స్ టార్గెట్ కేసీఆర్ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. తెలంగాణ ఉద్యమ నేత కేసీఆర్ బయోపిక్ ను తెరపైకి ఎక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. 

నిజానికి కేసీఆర్ బయోపిక్ ఇప్పటికే ఒకటి తెరపైకి వచ్చింది. అయితే వర్మ కోణం ఢిఫరెంట్ గా ఉంటుందని టాలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. కేసీఆర్ అసలైన జీవితాన్ని చూపిస్తానంటున్నారని టాక్ వినిపిస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే రీసెర్చ్ వర్క్ స్టార్ట్ అయిందని.. త్వరలోనే వర్మ ఈ మూవీకి సంబంధించిన  డీటెయిల్స్ బయటపెడరట వర్మ. 

ఎన్టీఆర్ బయోపిక్ ' లక్ష్మీస్ ఎన్టీఆర్ ' మూవీలో టీడీపీ అధినేత చంద్రబాబును పాత్రను నెగిటివ్ గా చూపిస్తున్న రాంగోపాల్ వర్మ ...మరి టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ జీవితాన్ని ఏ కోణంలో బయటపెడతారనే దానిపై ఉత్కంఠత నెలకొంది. 

Trending News