Renjarla Rajesh Comments on Saraswathi Matha: బాసరలో కొలువై ఉన్న చదువుల తల్లి సరస్వతీ మాతను అసభ్యకర పదజాలంతో దూషించిన హిందూ ద్రోహి రేంజర్ల రాజేష్‌పై పిడి యాక్ట్ నమోదు చేయాలని విశ్వహిందూ పరిషత్ నేతలు డిమాండ్ చేశారు. చదువుల తల్లిని ఐటమ్ గర్ల్ అని.. సరస్వతి ఎక్కడ చదువుకుందని.. అసలు ఆమె చదువుకున్న యూనివర్సిటీ ఏది అని.. చదువుకుంటే ఆమె మెడలో బంగారు పతకాలు ఉండాలి కానీ ఆభరణాలు ఎందుకు ఉన్నాయని.. మరి ముఖ్యంగా ఆమె డాన్స్ టీచర్ అని.. అందుకే సరస్వతి చేతిలో వీణ ఉంది" అని ఇలా నోటికొచ్చినట్టు మాట్లాడిన రేంజర్ల రాజేష్‌ను కఠినంగా శిక్షించాలని విశ్వహిందూ పరిషత్ నేతలు డిమాండ్ చేశారు. మంగళవారం విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు సురేందర్ రెడ్డి, పండరినాథ్, ప్రచార ప్రముఖ్ బాలస్వామి మీడియాతో మాట్లాడుతూ.. రేంజర్ల రాజేష్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.
కొంతమంది హిందూ ద్రోహులు హిందూ దేవుళ్లను విమర్శించి పబ్లిసిటీ పొందడం ఒక ఎజెండాగా పెట్టుకున్నారని.. ఆ దురుద్దేశంతోనే వాళ్లు హిందూ దేవతలు, దేవుళ్లపై అవాకులు చవాకులు పేలుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొన్ననే ఒకడు అయ్యప్ప పుట్టుక గురించి తప్పుగా మాట్లాడితే.. నేడు సరస్వతీ మాత ఉనికి గురించి ఇంకొకడు అసభ్యంగా మాట్లాడటం హిందువులపై జరుగుతున్న దాడికి నిదర్శనం అన్నారు. వీడియోలు.. ఆడియోలు.. వాళ్ల సొంత చానల్స్‌లలో రకరకాల హిందూ దేవి దేవతల వ్యతిరేక మాటలు, పాటలు, ఉపన్యాసాలు ఉన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం చూసి చూడనట్లు వ్యవహరిస్తోందని వీహెచ్ పి నేతలు మండిపడ్డారు. ప్రభుత్వ ఉదాసీన వైఖరి వల్లే హిందూ ద్రోహులంతా మరింత రెచ్చిపోపోతున్నారన్నారు. నాస్తిక వాదం పేరుతో హిందూ దేవుళ్ళని టార్గెట్ చేయడం.. దుర్భాషలాడటం క్షమించరాని నేరమని గుర్తుచేశారు. రాజ్యాంగంలోని వాక్ స్వాతంత్రపు హక్కును అడ్డం పెట్టుకొని ఇతరుల మనోభావాలు గాయపరిచేలా వ్యవహరిస్తున్న కొంతమంది చీడపురుగులను సమాజంలోంచి వేలి వేయాలని విశ్వహిందూ పరిషత్ నేతలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
రేంజర్ల రాజేష్, బైరి నరేష్ లాంటి ద్రోహులంతా ఒకే తాను ముక్కలని.. వారందరి గురువు ఒక్కరేనని మండిపడ్డారు. విదేశాల మిషనరీల నుంచి ఇబ్బడి ముబ్బడిగా వచ్చి పడే డబ్బులకు ఆశపడి కన్న తల్లికి ద్రోహం చేసే విధంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగం గురించి మాట్లాడుతూ రాజ్యాంగ గౌరవాన్ని మంటగలుపుతున్నారన్నారు. అంబేద్కర్ పేరు చెప్పి అంబేద్కర్ మూల సిద్ధాంతానికే ప్రమాదం తీసుకు వస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమాజంలోని ప్రతి వ్యక్తి తన మనసుకు కట్టుబడి నడుచుకోవచ్చని.. కానీ ఈ దుర్మార్గుల వ్యవహారం చూస్తుంటే ఇతరుల హక్కులను కలరాస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.
ఇతరులు పూజించి గౌరవించే దేవి దేవతలను లక్ష్యంగా చేసుకొని.. పరుల మనోభావాలను గాయపరచే చర్యలను రాజ్యాంగం కూడా క్షమించదన్నారు. కొంతమంది పోలీసు అధికారులు, తెలంగాణ ప్రభుత్వంలో ఉన్న ప్రముఖమైన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా ఇలాంటి వ్యక్తులకు మద్దతుగా నిలవడం సమాజం క్షమించదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వారి పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఓటు బ్యాంకు రాజకీయాలు మానుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి విశ్వహిందూ పరిషత్ నేతలు హితవు పలికారు.
ఇది కూడా చదవండి : Bairi Naresh Remand Report: బైరి నరేష్ రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు.. కుట్రపూరితంగానే అయ్యప్పపై వ్యాఖ్యలు!
ఇది కూడా చదవండి : HMRL Staff Protests: ఐదేళ్లుగా అదే జీతమంటే ఎలా ? మెట్రో రైలు సిబ్బంది ధర్నా.. స్పందించిన మేనేజ్మెంట్
ఇది కూడా చదవండి : Thief Sleeping: దొంగతనానికి వచ్చి తాపీగా నిద్రపోయిన దొంగ.. చివరికి ఊహించని ట్విస్ట్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook