Raithu Runa Mafi: తెలంగాణలో కాంగ్రెస్ నేతృత్వంలోని రేవంత్ రెడ్డి సర్కారు అధికారంలోకి వచ్చి యేడాది పూర్తి కావొస్తోంది. ఈ నేపథ్యంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తప్పించి పెద్దగా హామిలను అమలు చేసింది లేదు. రూ. 500 కు గ్యాస్ సిలిండర్.. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ కూడా ఏదో కంటి తుడపు చర్యగా అమలు చేసారు. ఇక తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత కొత్తగా పెళ్లన వాళ్లకు ఎవరికీ ఈ 10 యేళ్ల కాలంలో ఒక్క కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయలేదు. దీంతో అర్హులైన ఎంతో మంది ప్రభుత్వ పథకాలకు నోచుకోలేకపోతున్నారు. మరోవైపు సర్కారు మాత్రం.. ప్రభుత్వ పథకాల కోసం రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకుంటోంది. రేవంత్ సర్కార్ కొలువు దీరి యేడాది కావొస్తోన్న నేపథ్యంలో ముందుగా అర్హులైన వాళ్లకు రేషన్ కార్డులు మంజూరు చేయాలని చాలా మంది విజ్ఞప్తులు చేస్తున్నారు.
మరోవైపు రైతు రుణ మాఫీ అంటూ మరో పథకం కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి రావడానికి కీలకంగా మారిన సంగతి తెలిసిందే కదా. తాజాగా తెలంగాణలో రేవంత్ నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్ ఇవాళ రైతు రుణమాఫీ పై కీలక ప్రకటన జారీ చేసే అవకాశం వుంది. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా మహబూబ్‌నగర్‌లో నిర్వహిస్తున్న రైతు పండగ ముగింపు కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ ప్రకటన చేయనున్నారని తెలుస్తోంది.
రుణమాఫీ కింద నాలుగో విడతలో మూడు లక్షల మంది రైతులకు 3,000 కోట్లను సర్కార్ విడుదల చేస్తామని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇప్పటికే ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. దీనిపైనే సీఎం విధాన నిర్ణయం వెల్లడించే అవకాశం ఉందని తెలిసింది. ఇప్పటికే మూడు విడతల్లో కొంత మంది రైతుల ఖాతాల్లో రుణ మాఫీ నిధులను విడుదల చేసిన సంగతి తెలిసిందే కదా.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.