Agnipath Protest: ఆవేశం అనర్ధాలకు మూలం.. ఇది పెద్దలు చెప్పే మాట. ఆవేశంలో తీసుకునే కొన్ని తప్పుడు నిర్ణయాలు వాళ్ల జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతుంటాయి. తాజాగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన విధ్వంసకాండలోనే ఇదే జరిగినట్లు కనిపిస్తోంది. ఆర్మీ ఉద్యోగాల కోసం యువకులు ఆందోళనకు దిగారు. కాని ఇప్పుడు వాళ్లంతా చిక్కుల్లో పడ్డారు. ఆర్మీలో చేరడం తమ కల అని చెప్పుకున్న యువకులు.. తాజా ఘటనతో ఆర్మీ ఉద్యోగానికి అనర్హులుగా మారే పరిస్థితి వచ్చింది. సికింద్రాబాద్ అల్లర్లకు సంబంధించిన రైల్వే పోలీసులు నమోదు చేసిన కేసుల్లో ఇరుక్కుంటే.. వాళ్లు ఆర్మీ ఉద్యోగానికి అర్హులు కాకుండా పోతారు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన విధ్వంస కాండ ఘనకు సంబంధించి రైల్వే పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. రైల్వే ఆస్తులు ధ్వంసం చేసినందుకు ఐఆర్ఏ కింద కఠినమైన సెక్షన్ల కింద కేసులు పెట్టారు. ఐపీసీ, భారతీయ రైల్వే చట్టంలోని 14 సెక్షన్లను ప్రయోగించారు. సెక్షన్ 143, 147, 324, 307, 435,427, 448, 336, 332, 341,రెడ్ విత్ 149 తో పాటు ఇండియన్ రైల్వే యాక్ట్ 150, 151, 152, కింద కేసులు నమోదు చేశారు. ఇండియన్ రైల్వే యాక్ట్ సెక్షన్లు చాలా సీరియస్ గా ఉంటాయి. ఇందులో ఎక్కువగా నాన్‌బెయిలబుల్ సెక్షన్లే. ఐఆర్‌ఏ 150 సెక్షన్ కింద నేరం రుజువైతే యావజ్జీవ శిక్ష లేదా మరణశిక్షకు గురయ్యే అవకాశముంది.
రైల్వే పోలీసులు నమోదు చేసిన కేసుల్లో ఇరుక్కుంటే ఆర్మీ ఉద్యోగానికి అనర్హులు అవుతారు. ఇతర సర్కార్ కొలువులో చేరడానికి అడ్డంకులు వస్తాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన విధ్వంసకాండలో పాల్గొన్నదంతా ఆర్మీ ఉద్యోగంలో చేరేందుకు సిద్ధంగా ఉన్నావాళ్లే. వారంలో చాలా మంది ఆర్మీ రిక్రూట్ మెంట్ లో మెడికల్, రన్నింగ్ టెస్టులు పాసైన వాళ్లే ఉన్నారంటున్నారు. ఎగ్జామ్ రద్దు చేశారన్న ఆవేశంతో నిరసనకు దిగగా.. అది అదుపుతప్పి హింసాత్మకంగా మారింది. భారీగా నష్టం జరిగింది. మూడు రైళ్లకు నిప్పు పెట్టారు నిరసనకారులు. 30 రైలు బోగీలను ధ్వంసం చేశారు. విధ్వంసకాండలో దాదాపు 20 కోట్ల మేర నష్టం జరిగిందని రైల్వే అధికారులు అంచనా వేస్తున్నారు.
సికింద్రాబాద్ ఘటనలో 13 నిరసనకారులు తీవ్రంగా గాయపడ్డారు. వాళ్లకు గాంధీ హాస్పిటల్ లో చికిత్స అందించారు. మరి కొందరు కూడా గాయపడినట్లు తెలుస్తోంది. నలుగురికి బుల్లెట్ గాయాలయ్యాయి. వీరు గతంలోలా రన్నింగ్ చేయలేదు. హైజంప్, లాంగ్‌జంప్ లాంటివి చేయడం కష్టమే. వీళ్లు కాడా భవిష్యత్ లో ఇబ్బందులు పడాల్సి వస్తుందని వైద్యులు చెబుతున్నారు. మొత్తంగా పరీక్ష నిర్వహించాలనే డిమాండ్ తో ఆవేశంలో యువకులు చేసిన తప్పిదంతో.. వాళ్లు జీవితంలో భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితిలో పడ్డారు.
Read also: Agnipath Row : రాకేష్ మృతికి నిరసనగా టీఆర్ఎస్ బంద్.. మోడీ దుర్మార్గం వల్లే చనిపోయాడని కేసీఆర్ ఫైర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook