తెలంగాణ పర్యటనలో భాగంగా ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ..టీఆర్ఎస్,బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జహీరాబాద్ బహిరంగ సభలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ -బీజేపీ మధ్యే ప్రధాన యుద్ధమని ఆశ్చర్యకరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ మోడీల మధ్య చీకటి ఒప్పందం ఉందని..ఎన్నికల తర్వాత అది బయటపడుతుందన్నారు. ఎన్నికల వేళ కేసీఆర్ మోడీ మధ్య డ్రామా నడుస్తోందని విమర్శించారు. బీజేపీతో టీఆర్ఎస్ పరోక్షంగా దోస్తీ చేస్తుంనందున ఈ ఎన్నికల్లో తమ ప్రధాన ప్రత్యర్ధి బీజేపీ గానే భావిస్తున్నామని రాహుల్ వివరణ ఇచ్చారు
పేదల బతుకులపై మోడీ సర్జికల్ స్ట్రయిక్స్..
ఈ సందర్బంగా ప్రధాని మోడీపై రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రధాని మోడీ పేదలకు చౌకీదార్ కాదని...ధనవంతులకు ఆయన కాపలా దారుడని విమర్శించారు . మోడీ సర్జికల్ స్ట్రయిక్ చేసింది నిజమేనని.. అయితే ఆయన చేసింది పాక్ పై కాదని...ఐదేళ్ల పాలనలో పేదల బతుకులపై సర్జికల్ స్ట్రయిక్ చేశారని రాహుల్ గాంధీ ఎద్దేవ చేశారు
రూ.72 వేలు ఇస్తామని హామీ
ఈ సభలో రాహుల్ గాంధీ నగదు జమా పథకం గురించి ప్రస్తావించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి పేద కుటుంబానికి ఏడాదికి 72 వేల ఆర్ధిక సాయం చేస్తామని... ఈ క్రమంలో ప్రతి నెల పేదల అకౌంట్ రూ. 6 వేల జమా చేస్తామాని హామీ ఇచ్చారు. అలాగే రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. మహిళలకు ఉచితంగా గ్యాస్ సిలిండర్ ఇస్తామని హామీ ఇచ్చారు. అలాగే విభజన చట్టంలోని పొందుపర్చిన తెలంగాణకు సంబంధించిన అంశాలను అమలు చేస్తామని ఈ సందర్భంగా రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు.