చీరలంటూ ఛీకొట్టే పనులు.. బీటెక్ స్టూడెంట్ అరెస్ట్

యువతుల ఫోన్ నెంబర్లను సేకరించి వారి వాట్సాఫ్ ఫొటోలను మార్ఫింగ్ చేసి వేధింపులకు పాల్పడుతున్న బీటెక్ స్టూడెంట్‌ను రాచకొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Last Updated : Feb 26, 2020, 11:40 AM IST
చీరలంటూ ఛీకొట్టే పనులు.. బీటెక్ స్టూడెంట్ అరెస్ట్

హైదరాబాద్; పోక్సో చట్టం, నిర్భయ లాంటి చట్టాలు ఎన్ని తీసుకొచ్చినా మార్పు రావడం లేదు. బాలికలు, యువతులు, మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. మరికొన్ని రోజుల్లో నిర్భయ దోషులకు శిక్ష పడనున్న విషయం తెలిసిందే. అయినా దురాగతాలకు పాల్పడి పోలీసులకు చిక్కి శిక్ష అనుభవిస్తున్నారు. ఈ క్రమంలో అసభ్యకర మెస్సేజ్‌లు, ఫొటోలు పంపి ఓ యువతికి వేధించిన బీటెక్ స్టూడెంట్‌ను రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

See photos: భీష్మ సక్సెస్ మీట్‌లో రష్మిక మెరుపులు 

తమిళనాడులోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంజినీరింగ్ చదువుతున్న యువకుడు హైదరాబాద్‌లో ఉంటున్నట్లుగా నకిలీ ధ్రువపత్రాలు ఇచ్చి సిమ్ కార్డులు కొంటున్నాడు. వాట్సాప్‌లో ఓ గ్రూపు క్రియేట్ చేసిన యువకుడు తాను చీరలు, లేడిస్ డ్రెస్సులు, నగలు విక్రయిస్తానని నమ్మించి యువతులు, మహిళల ఫోన్ నెంబర్లు సేకరించేవాడు. ఈ క్రమంలో మల్కాజిగిరికి చెందిన ఓ యువతి నెంబర్ కనుక్కుని, ఆమెతో చాటింగ్ మొదలుపెట్టాడు. కొన్ని రోజుల తర్వాత ఆమెకు అసభ్యకర ఫొటోలు, మెస్సేజ్‌లు పంపుతూ వేధించడం ప్రారంభించాడు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి 

వాట్సాప్ స్టేటస్‌లో యువతి అప్ డేట్ చేసే ఫొటోలను ఫొటోషాప్‌ సాయంతో అసభ్యకరంగా చేసి, వాటిని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. బాధితురాలు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. నిందితుడి ఫోన్ నెంబర్‌ను ట్రేస్ చేసిన రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ వద్ద ఆ యువకుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. బాలికలు, ఆడవారిని వేధిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. 

Also Read: తనకంటే 37 ఏళ్లు పెద్ద వ్యక్తితో నటి రిలేషన్

See Photos: బుల్లితెర భామ.. మాల్దీవుల్లో హంగామా 

జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News