TS Police Jobs: తెలంగాణలో కొలువుల జాతర కొనసాగుతోంది. గత కొంతకాలంగా వివిధ శాఖల నుంచి నోటిఫికేషన్లు వస్తున్నాయి. పోలీస్ శాఖలో ఉద్యోగాల భర్తీకి ఇటీవల దరఖాస్తుల స్వీకరణ పూర్తి అయ్యింది. తాజాగా పోలీస్ ఉద్యోగాలకు పరీక్షా తేదీలు వచ్చేశాయి. ఆ షెడ్యూల్‌ను రిక్రూట్మెంట్ బోర్డు ప్రకటించింది. రెండు దఫాలుగా పరీక్షలు జరగనున్నాయి. ఆగస్టు 7న ఎస్సై(SI) ప్రిలిమ్స్, ఆగస్టు 21న కానిస్టేబుల్ ప్రిలిమ్స్ పరీక్ష జరుగుతుంది.
ఈనెల 30 నుంచి ఎస్సై పరీక్షలకు సంబంధించిన అభ్యర్థులకు హాల్ టికెట్లను పొందే అవకాశం ఉంది. ఇటు కానిస్టేబుల్ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను ఆగస్టు 10 నుంచి పొందవచ్చు. www.tslprb.in ద్వారా హాల్ టికెట్లు పొందవచ్చని అధికారులు తెలిపారు. ఎస్సై, కానిస్టేబుల్ పరీక్షలకు సుమారుగా 8.95 లక్షల మంది హాజరుకానున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై అధికారులు దృష్టి పెట్టారు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని రిక్రూట్మెంట్ బోర్డు స్పష్టం చేసింది.
మరోవైపు రాష్ట్రంలో మరిన్ని నోటిఫికేషన్లు రానున్నాయి. మొత్తం 90 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలుకు భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారు. ఇందులో 80 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేస్తామని..మిగిలిన 10 వేల పోస్టులను ఒప్పంద ఉద్యోగులను క్రమబద్దీకరిస్తామని తెలిపారు. అప్పటి నుంచి వరుసగా నోటిఫికేషన్లు వస్తున్నాయి.
Also read:CM Jagan: అల్లూరి అంటే పేరు కాదు..మహా అగ్నికణం..విగ్రహావిష్కరణలో సీఎం జగన్..!
Also read:Sharad Pawar: మహా'డ్రామా' మళ్లీ మొదలయ్యేనా..ఏక్నాథ్ వర్గంపై శరద్ పవార్ ఏమన్నారంటే..!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook