FIR Against ChinnaJeeyar Swamy: త్రిదండి చినజీయర్ స్వామి మరోసారి వార్తలోకి ఎక్కారు. ఈసారి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పంచాయితీ కాదు.. మరో వివాదంలో చిక్కుకున్నారు. ఈసారి వివాదం మాత్రం త్రిదండి చినజీయర్ స్వామి చేతులారా చేసుకున్నదే అంటున్నారు. తాజాగా చినజీయర్ స్వామి ఆదివాసుల ఆరాధ్య దైవమైన సమ్మక్క-సారలమ్మ వివాదంలో చిక్కుకున్నారు. ఈ ఇష్యూలో చిన్న జీయర్ స్వామిపై పోలీస్ కేసు నమోదైంది.
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. తెలంగాణలో గిరిజనులు ఆరాధించే సమ్మక్క, సారలమ్మల మీద చిన్న జీయర్ స్వామి చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ ఆదివాసీ గిరిజన సంక్షేమ సంఘాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. ఆదివాసీల ఆరాధ్య దైవం సమ్మక్క-సారలమ్మలపై త్రిదండి చిన్న జీయర్ స్వామి చేసిన వ్యాఖ్యలను తక్షణమే వెనక్కి తీసుకొని.. ఆదివాసీ గిరిజనులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో తెలంగాణ వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా దిష్టి బొమ్మలు దహనం చేసి నిరసన చేపట్టారు. త్రిదండి చిన్న జీయర్ స్వామిపై ములుగు ఎమ్మెల్యే సీతక్క తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా చిన్న జీయర్ స్వామిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
మేడారం సమ్మక్క-సారలమ్మలపై చిన్నజీయర్ స్వామి చేసిన అనుచిత వ్యాఖ్యలపై తక్షణమే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్ముగూడెం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆదివాసీల ఆరాధ్య దైవం సమ్మక్క-సారలమ్మను కించపరిచి చిన్న జీయర్ స్వామి వ్యాఖ్యలు చేశారని.. ఆయన చేసిన కామెంట్స్ వీడియోతో సహా పోలీసులకు సమర్పించారు ఆదివాసీ సంక్షేమ పరిషత్ నేతలు. ఆదివాసుల ఆడబిడ్డ చరిత్ర తెలియని చిన్న జీయర్ స్వామికి మాట్లాడే నైతిక హక్కు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో త్రిదండి చిన్న జీయర్ స్వామి అనవసరంగా కొరివితో తల గోక్కున్నట్లు అయ్యిందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలావుంటే, ఇటీవల ముచ్చింతల్‌లో రామానుజాచార్య విగ్రహావిష్కరణ టైంలో తనకు అవమానం జరిగిందని సీఎం కేసీఆర్ ఫీలవడం.. ప్రధాని మోదీకి త్రిదండి చినజీయర్ స్వామి ప్రాధాన్యం ఇచ్చారనే ఆగ్రహంతో సీఎం కేసీఆర్ ప్రధాని మోదీకి స్వాగతం పలకడానికి వెళ్లలేదని, అలా త్రిదండి చినజీయర్.. సీఎం కేసీఆర్ మధ్య దూరం పెరిగిందని ఆమధ్య వార్తలు వచ్చాయి. సీఎం కేసీఆర్, త్రిదండి చినజీయర్ మధ్య జరిగిన వ్యవహారం అందరికీ తెలుసు. యాదాద్రిలో నిర్వహించబోయే ఉద్ఘాటనకు చిన్న జీయర్ స్వామిని పిలువకపోవచ్చని సమాచారం. తాజాగా వెలువడిన ఎన్నికల ఫలితాల్లో నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ మనసు మనసులో లేదని బీజేపి వ్యంగ్యాస్త్రాలు సంధిస్తోంది. నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ గెలుపు ఎఫెక్ట్ త్రిదండి చిన్న జీయర్ స్వామి మీద ఉంటుందనే టాక్ కూడా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో చిన్న జీయర్ స్వామి వివాదంపై (Chinnajeeyar Swamy about rift with CM KCR) సీఎం కేసీఆర్ ఎలా స్పందిస్తారోననే ప్రచారం కూడా జరుగుతోంది.
Also read : Komatireddy Rajagopal Reddy: పార్టీ మార్పు..? కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook