PM MODI HYD TOUR: హైదరాబాద్ లో ప్రధాని మోడీ మినిట్ టు మినిట్ షెడ్యూల్.. సైబరాబాద్ లో ట్రాఫిక్ మళ్లింపు

PM MODI HYD TOUR: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురువారం హైదరాబాద్ లో పర్యటించనున్నారు. ప్రధాని పర్యటనకు సంబంధించి అధికారికంగా పూర్తి షెడ్యూల్ ఇచ్చింది పీఎంవో. మధ్యాహ్నం 1.30కి బేగంపేట ఎయిర్ పోర్టులో ల్యాండ్ కానున్నారు ప్రధాని మోడీ. 1.45 వరకు ఎయిర్ పోర్టు పార్కింగ్ లో రాష్ట్ర బీజేపీ నేతలతో సమావేశమవుతారు

Written by - ZH Telugu Desk | Last Updated : May 25, 2022, 03:00 PM IST
  • గురువారం హైదరాబాద్ లో ప్రధాని పర్యటన
  • మూడు గంటల పాటు నగరంలో మోడీ
  • సైబరాబాద్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు
 PM MODI HYD TOUR: హైదరాబాద్ లో ప్రధాని మోడీ మినిట్ టు మినిట్ షెడ్యూల్.. సైబరాబాద్ లో ట్రాఫిక్ మళ్లింపు

 

PM MODI HYD TOUR: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురువారం హైదరాబాద్ లో పర్యటించనున్నారు. ప్రధాని పర్యటనకు సంబంధించి అధికారికంగా పూర్తి షెడ్యూల్ ఇచ్చింది పీఎంవో.మధ్యాహ్నం 1.30కి బేగంపేట ఎయిర్ పోర్టులో ల్యాండ్ కానున్నారు ప్రధాని మోడీ. 1.45 వరకు ఎయిర్ పోర్టు పార్కింగ్ లో రాష్ట్ర బీజేపీ నేతలతో సమావేశమవుతారు. 1.50కి హెలికాప్టర్ లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ హెలిప్యాడ్ కు వెళతారు. అక్కడ దిగిన తర్వాత రోడ్డు మార్గాన గచ్చిబౌలి ఐఎస్బీకి చేరుకుంటారు. మధ్యాహ్నం 2 నుంచి 3.15 గంటల మధ్య ఐఎస్‌బీ వార్షికోత్సవంలో పాల్గొంటారు ప్రధాని మోడీ. సాయంత్రం 4 గంటలకు తిరిగి బేగంపేటకు వస్తారు. 4 .15కు  బేగం పేట్ నుండి చెన్నైకి బయలుదేరి వెళతారు నరేంద్ర మోడీ.  

 

ప్రధాని మేడీ రాక సందర్భంగా సైబరాబాద్ లో  ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. గురువారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉండనున్నాయి.లింగంపల్లి నుంచి గచ్చిబౌలికి వచ్చే వాహనదారులు.. HCU డిపో వద్ద ఎడమవైపు తీసుకొని మసీద్ బండ కమాన్ వద్ద మళ్లీ లెఫ్ట్ టర్న్ తీసు కొని కొండాపూర్ ఏరియా ఆస్పత్రి, బొటానికల్ గార్డెన్ వద్ద రైట్ టర్న్ తీసుకొని గచ్చిబౌలికి రావాల్సి ఉంటుంది. విప్రో జంక్షన్ నుంచి లింగంపల్లికి వెళ్లేవారు.. విప్రో జంక్షన్ వద్ద ఎడమకు తిరిగి క్యూ సిటీ, గౌలిదొడ్డి, గోపన్ పల్లి ఎక్స్ రోడ్డులో రైట్ టర్న్ తీసు కొని హెచ్సీయూ బ్యాక్ గేట్ నుంచి నల్లగండ్ల మీదుగా లింగంపల్లి చేరుకోవాలి. విప్రో జంక్షన్ నుంచి గచ్చిబౌలికి వెళ్లాల్సిన వాహనదారులు.. విప్రో. జంక్షన్ వద్ద రైట్ టర్న్ తీసుకొని ఫెయిర్ ఫీల్డ్ హోటల్, నానక్రామ్ గూడ రోటరీ వద్ద లెఫ్ట్ టర్న్ తీసుకొని ఓఆర్ఆర్ రోడ్డు, ఎల్ అండ్ టీ టవర్స్ ద్వారా గచ్చిబౌలి జంక్షను చేరుకోవచ్చు. కేబుల్ బ్రిడ్జి మీదుగా గచ్చిబౌలికి వెళ్లాల్సిన వాహనదారులు.. కేబుల్ బ్రిడ్జి అప్లమ్ రోడ్డు నంబర్ 45, మాదాపూర్ రత్నదీప్, మాదాపూర్ పోలీస్ స్టేషన్, సైబర్ టవర్స్, హైటెక్స్, కొత్తగూడ, బొటానికల్ గార్డెన్ ద్వారా గచ్చిబౌలి జంక్షన్ కు చేరుకోవాలి. గచ్చిబౌలి జంక్షన్ నుంచి లింగంపల్లి వెళ్లే వాహనదారులు.. గచ్చిబౌలి జంక్షన్ వద్ద రైట్ టర్న్ తీసుకొని బొటానికల్ గార్డెన్ వద్ద లెఫ్ట్ తీసుకొని కొండాపూర్ ఏరియా ఆస్పత్రి, మసీద్ బండ, మసీద్ బండ కమాన్, హెచ్సీయూ డిపో రోడ్డు గుండా లింగంపల్లికి వెళ్లాల్సి ఉంటుంది.

ఇక ప్రధాని మోడీ పర్యటనకు రాష్ట్ర బీజేపీ భారీగా ఏర్పాట్లు చేస్తోంది. హైదరాబాద్ నగరమంతా కాషాయమయం చేస్తున్నారు. నరేంద్ర మోడీకి స్వాగతం చెబుతూ భారీగా బ్యానర్లు, ఫ్లెక్సీలు కట్టారు. బేగంపేట ఎయిర్ పోర్టులో 40 వేల మందితో స్వాగతం చెప్పేందుకు నగర కమలం నేతలు జన సమీకరణ చేస్తున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పర్యటనలతో పార్టీలో జోష్ వచ్చింది. అదే ఉత్సాహంతో ప్రధాని మోడీ పర్యటనకు తమకు అనుకూలంగా మలుచుకోవడానికి తెలంగాణ బీజేపీ ప్లాన్ చేస్తోంది. మోడీ స్వాగత ఏర్పాట్లను బండి సంజయ్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.

READ ALSO: Konaseema Protest: అప్పుడు తుని.. ఇప్పుడు అమలాపురం! మంటలతో భీతిల్లిన గోదావరి జనం..

READ ALSO: America Gun Fire:18 మంది విద్యార్థులు, ముగ్గురు టీచర్లు కాల్చివేత.. అమెరికాలో మరోసారి కాల్పుల మోత

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News