Petrol Prices: దేశంలో మళ్లీ పెరగనున్నపెట్రోల్, డీజిల్ ధరలు.. రికార్డ్ హైకి చేరిన క్రూడాయిల్ రేట్

Petrol Prices: వినియోగదారులకు బ్యాడ్ న్యూస్. దేశంలో చమురు ధరలు మళ్లీ భారీగా పెరగనున్నాయి. దేశంలో కొన్ని రోజులు పెట్రోల్, డీజిల్ రేట్లు నిలకడగా ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధర పెరిగినా.. మన దేశంలో మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలు పెరగలేదు.

Written by - Srisailam | Last Updated : Jun 12, 2022, 11:54 AM IST
  • రికార్డ్ హైకి చేరిన క్రూడాయిల్ రేట్
  • దేశంలో పెరగనున్న చమురు ధరలు
  • గత మూడు వారాలుగా మారని రేట్లు
Petrol Prices: దేశంలో మళ్లీ పెరగనున్నపెట్రోల్, డీజిల్ ధరలు.. రికార్డ్ హైకి చేరిన క్రూడాయిల్ రేట్

Petrol Prices: వినియోగదారులకు బ్యాడ్ న్యూస్. దేశంలో చమురు ధరలు మళ్లీ భారీగా పెరగనున్నాయి. దేశంలో కొన్ని రోజులు పెట్రోల్, డీజిల్ రేట్లు నిలకడగా ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధర పెరిగినా.. మన దేశంలో మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలు పెరగలేదు. గత మూడు వారాలుగా చమురు ధరలు పెరగలేదు, తగ్గలేదు. కాని త్వరలో షాక్ తగలడం ఖాయంగా తెలుస్తోంది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయని భావిస్తున్నారు.

అంతర్జాతీయ మార్కెట్ లో కొన్ని రోజులుగా ముడి చమురు ధర భారీగా పెరిగిపోయింది. ప్రస్తుతం క్రూడాయిల్ రేట్ బ్యారెల్‌కు 121.28 డాలర్లకు చేరింది. గత 10 సంవత్సరాల్లో ఇదే రికార్డ్. 2012 తర్వాత ఇంతగా పెరిగిపోవడం ఇదే. కొన్ని రోజులుగా క్రూడాయిల్ రేట్ పెరిగిపోతున్నా దేశంలోని చమురు సంస్థలు మాత్రం రేట్లు పెంచలేదు. మే 21న కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని భారీగా తగ్గించింది. కేంద్రం స్పూర్తిగా పలు రాష్ట్రాలు కూడా తమ పరిధిలోని వ్యాట్ ను తగ్గించాయి. దీంతో వాహనదారులకు ఉపశమనం కల్గింది.

కేంద్రం ఎక్సైజ్ సుంకం తగ్గించడం, అంతర్జాతీయ మార్కెట్ లో క్రూడాయిల్ ధర పెరిగినా రేట్లు పెంచకపోవడంతో దేశంలోని చమురు కంపెనీలపై భారం పడింది. చమురు కంపెనీల లాభాలపైనా పడింది. భారం పెరిగిపోవడంతో పెట్రోల్, డీజిల్ ధరలు పెంచాలని చమురు సంస్థలు నిర్ణయించాయని తెలుస్తోంది. త్వరలోనే హైక్ మొదలవుతుందని అంటున్నారు. ఆదివారం ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ 96.72, డీజిల్ ధర రూ. 89.62గా ఉంది.

Read also: KTR COMMENTS: తెలంగాణలో ముందస్తు ఎన్నికలు ఖాయం! ఖమ్మం నేతలకు కేటీఆర్ సంకేతం..

Read also: TS TET 2022: నిమిషం లేటైనా నో ఎంట్రీ.. బతిమాలినా కనికరించని పోలీసులు! సెంటర్ల దగ్గర అభ్యర్థుల కన్నీళ్లు.. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News