టీఆర్ఎస్ పార్టీ మాదే..: నాయిని నర్సింహా రెడ్డి

టీఆర్ఎస్ పార్టీ మాదే..: నాయిని నర్సింహా రెడ్డి

Last Updated : Sep 11, 2019, 05:25 PM IST
టీఆర్ఎస్ పార్టీ మాదే..: నాయిని నర్సింహా రెడ్డి

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తమదేనని చెప్పిన మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి.. అందులో ఉన్న పదవులు కూడా తమకే వస్తాయని  ఆశాభావం వ్యక్తంచేశారు. బుధవారం మీడియాతో చిట్‌చాట్ నిర్వహించిన ఆయన.. మీడియాలో వచ్చిన వార్తల గురించి కేటీఆర్‌ తన వద్ద ప్రస్తావించారని తెలిపారు. తాను మీడియాతో ఏదో చిన్నగా చిట్‌చాట్‌ చేస్తే.. దానినే పెద్ద వార్తగా రాశారని నాయిని నర్సింహా రెడ్డి అభిప్రాయపడ్డారు. 

మంత్రి వర్గ విస్తరణ అనంతరం ఆర్టీసీ కార్పొరేషన్‌ పదవిలో రసం లేదని ఇదివరకు వ్యాఖ్యానించిన నాయిని.. ఇప్పుడు అదే ఆర్టీసీ కార్పొరేషన్ పదవి ఇచ్చినా రసం వాళ్లే పోస్తారని చెప్పడం గమనార్హం. అంతేకాకుండా తనని ముఖ్యమంత్రి కేసీఆర్ పిలిచినా వెళ్లి మాట్లాడటానికి సిద్ధమేనని తెలిపారు.

Trending News