Nagarjuna Forest: 1,080 ఎకరాలు ఫారెస్ట్ ను దత్తత తీసుకున్న హీరో అక్కినేని నాగార్జున

Nagarjuna Forest: గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా అక్కినేని నాగార్జున ఓ మహత్కార్యానికి పూనుకున్నారు. 1,080 ఏకరాల్లో ఉన్న అడవిని దత్తత తీసుకొని.. చెట్లను సంరక్షించడం సహా కొత్త మొక్కలను నాటేందుకు ప్రతిజ్ఞ తీసుకున్నారు. ఆ ప్రాంతానికి అక్కినేని నాగేశ్వరరావు అర్బన్ ఫారెస్ట్ పార్క్ గా నామకరణం చేసినట్లు నాగార్జున ట్వీట్ చేశారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 17, 2022, 02:24 PM IST
    • గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో మరోసారి భాగమైన అక్కినేని నాగార్జున
    • 1,080 ఎకరాల అటవీ ప్రాంతాన్ని దత్తత తీసుకున్నట్లు ప్రకటన
    • ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ సంతోష్, అక్కినేని కుటుంబసభ్యులు
Nagarjuna Forest:  1,080 ఎకరాలు ఫారెస్ట్ ను దత్తత తీసుకున్న హీరో అక్కినేని నాగార్జున

Nagarjuna Forest: రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఇప్పటికే విపరీతమైన ఆదరణ దక్కించుకుంది. ఈ కార్యక్రమంలో భాగంగా దేశ వ్యాప్తంగా ఎంతో మంది సినీ, రాజకీయ ప్రముఖులు మొక్కలు నాటి ఈ కార్యక్రమంలో భాగమయ్యారు. సంతోష్ కుమార్ చేపట్టిన ఇంతటి మహత్కార్యానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ప్రశంసించారు. 

కొన్ని నెలల క్రితం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో టాలీవుడ్ అగ్రకథానాయకుడు అక్కినేని నాగార్జున పాల్గొన్నారు. అదే సమయంలో తాను ఓ అడవిని దత్తత తీసుకునేందుకు ముందుకొస్తానని రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ కు మాట ఇచ్చారు. ఈ క్రమంలో ఆ మాటను నేడు (ఫిబ్రవరి 18) నేరవేర్చుకునేందుకు బాటలు వేశారు. 

దాదాపుగా 1,080 ఎకరాల విస్తీర్ణంలోని అడవిని దత్తత తీసుకున్నట్లు నాగార్జున తన ట్విట్టర్ లో పేర్కొన్నారు. అంతే కాకుండా ఆ అడవిలో మొక్కులు పెంచుతామని ఆయన అన్నారు. ఈ సందర్భంగా శిలా ఫలకాన్ని ఆవిష్కరించి.. మొక్కలు నాటారు. ఆయనతో పాటు నాగ్ కుమారులు నాగ చైతన్య, అఖిల్ తో పాటు మేనల్లుడు సుశాంత్, అక్కినేని కుటుంబసభ్యులు కూడా మొక్కులు నాటారు.  

ఈ కార్యక్రమంలో ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ తో పాటు అక్కినేని కుటుంబం నుంచి నాగార్జున, నాగ చైతన్య, అఖిల్, సుమంత్, సుశాంత్, నాగ సుశీల నాగార్జునతో పాటు నాగచైతన్య, అఖిల్, సుమంత్, సుశాంత్, నాగ సుశీల.. తదితరులు పాల్గొన్నారు. ఆ దత్తత తీసుకున్న అటవీ ప్రాంతానికి అక్కినేని నాగేశ్వరరావు అర్బన్ ఫారెస్ట్ పార్క్ అనే పేరు పెట్టారు.  

Also Read: Nani Dasara Movie Launched: పట్టాలెక్కిన నాని కొత్త సినిమా 'దసరా'...

Also Read: Bappi Lahiri: అమెరికా నుంచి రావాల్సిన కుమారుడు.. బప్పి లహిరి అంత్యక్రియలు రేపే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News