భారత ప్రధాని నరేంద్ర మోడీ మెట్రో రైలు ప్రారంభోత్సవ సభకు హాజరు కావడం కోసం హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయానికి ఇప్పుడే చేరుకున్నారు. విమానాశ్రయంలో మోడీకి గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కేసీఆర్ ఘన స్వాగతం పలికారు. మాజీ కేంద్ర మంత్రి మరియు సినీనటుడు క్రిష్ణంరాజు కూడా మోడీని గౌరవ ప్రదంగా విమానాశ్రయంలో కలుసుకున్నారు. ఇంకొద్ది సేపట్లో మియాపూర్ స్టేషనులో ఆయన మెట్రో రైలును ప్రారంభించనున్నారు. ఆ తర్వాత హెచ్‌ఐసీసీలో జరగనున్న "గ్లోబల్ ఎంట్రప్రెన్యూర్‌షిప్ మీట్"కు వెళ్లి, అమెరికా ప్రభుత్వ సలహాదారు ఇవాంకా ట్రంప్‌ను కలవనున్నారు. ఇప్పుడే ఆయన మెట్రో ప్రారంభోత్సవంలో ప్రసంగించారు
ఆ ప్రసంగం తెలుగులోనే ఉండడం విశేషం. కొద్ది సేపు తెలుగులో మాట్లాడిన ఆయన, మళ్లీ హిందీలో ప్రసంగించారు. తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచం మొత్తం హైదరాబాద్ వైపు చూస్తుందని తెలిపారు. ఈ ప్రాంతానికి రావడం ఆనందంగా ఉందని కూడా తెలియజేశారు. ప్రపంచ పారిశ్రామికవేత్తలందరూ ఈ రోజు హైదరాబాద్ వచ్చారంటే.. ఈ నగరం గొప్పతనం ఏమిటో తెలుస్తుందని ఆయన అన్నారు. హైదరాబాద్ వచ్చినప్పుడల్లా తనకు సర్దార్ వల్లభాయ్ పటేల్ గుర్తుకొస్తుంటారని మోడీ అన్నారు. తెలంగాణ అమరవీరులకు జోహార్లు అని కూడా చెప్పారు. అన్ని రాష్ట్రాల సహకారంతోటే భారతీయ జనతా పార్టీ అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించిందని ఆయన పేర్కొన్నారు. సోదర సోదరీమణులారా అని తెలుగులో ప్రసంగించిన మోడీ.. ఆ తర్వత ధన్యవాదాలు అనే తెలుగు పదంతో ప్రసంగాన్ని ముగించారు. ప్రస్తుతం ఒక ప్రత్యేకమైన విమానంలో మోడీ మియాపూర్‌కి ప్రయాణమయ్యారు. అక్కడ ప్రారంభోత్సవం తర్వాత గవర్నరు నరసింహన్‌తో కలిసి ఆయన ప్రయాణం కూడా చేయబోతున్నారు.