MLC Kavitha Comments: నిజామాబాద్ ఎంపీగా ఓటమి తర్వాత దాదాపు మూడేళ్ల పాటు ప్రజా క్షేత్రంలో తిరగని ఎమ్మెల్సీ కవిత.. కొన్ని రోజులుగా మళ్లీ యాక్టివ్ అయ్యారు. వరుస కార్యక్రమాలతో జనంలోకి వెళుతున్నారు. సోషల్ మీడియా వేదికగా బీజేపీ, కాంగ్రెస్ ను టార్గెట్ చేస్తున్నారు. తాజాగా జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలో పర్యటించారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ, కాంగ్రెస్ లపై విరుచుకుపడ్డారు కవిత. ఎంపీ ధర్మపురి అర్వింద్, కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని టార్గెట్ చేశారు.
తెలంగాణ తెచ్చుకున్నదే యువత కోసమన్నారు ఎమ్మెల్సీ కవిత. దేవుడి పేరుతో రాజకీయం చేయాలని చూస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. వాళ్లు జై శ్రీరాం అంటే.. మనం జై హనుమాన్ అందామంటూ పార్టీ కార్యకర్తలకు పిలుపిచ్చారు.అవసరం అయితే దేవుణ్ణి కూడా ప్రజలు ప్రశ్నిస్తారని అన్నారు. రాజకీయం మొత్తం దేవుడి చుట్టే తిప్పితే ఊరుకునేది లేదన్నారు. విగ్రహాలు పెట్టి దాని చుట్టే తిరుగుతామని అంటే నడవదన్నారు కవిత. ప్రజాస్వామ్యంలో గెలిచిన వాళ్లకు మర్యాద ఇస్తామన్నారు. గెలిచిన ఎంపీ అరవింద్ కు 3 ఏండ్లు అవకాశం ఇచ్చినా, రైతులకు ఏం చేయలేదని ఆరోపించారు. పసుపు బోర్డు బదులు తెచ్చిన ఆఫీస్ కూడా తాను తెచ్చిందే అన్నారు కవిత. మనం చేసిన పనులు కూడా, వాళ్ళే చేసినట్టు బీజేపీ నేతలు ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. అబద్దాలకు ప్రతిరూపం అరవింద్ అంటూ మండిపడ్డారు.
కేసీఆర్ ని తిట్టడం తప్ప ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి బీజేపీని ఏమి అనరని కవిత విమర్శించారు. పసుపు బోర్డు, ధరల పెరుగుదలపై బీజేపీని ఎందుకు విమర్శించరని అన్నారు, బీజేపీతో జీవన్ రెడ్డి మ్యాచ్ ఫిక్సింగ్ అయ్యారేమో అంటూ హాట్ కామెంట్స్ చేశారు కవిత. కాంగ్రెస్ వాళ్లు రచ్చబండ అని గ్రామాలకు వస్తే.. టీఆర్ఎస్ సర్కార్ చేసిన అభివృద్ధి చూపించాలని కార్యకర్తలకు సూచించారు. తెలంగాణకు రావాల్సిన బకాయిల గురించి పార్లమెంటులో మాట్లాడాలని రాహుల్ గాంధీని కోరాల్సిందిగా జీవన్ రెడ్డిని ప్రజలు నిలదీయాలన్నారు. కాంగ్రెస్, బీజేపీ నాయకుల విమర్శకులకు దీటుగా సమాధానం చెప్పాలన్నారు. సగర్వంగా, గులాబీ కండుగా మెడలో వేసుకుని టీఆర్ఎస్ నేతలు సమాధానం చెప్పాలన్నారు కవిత. ఎలాంటి అవినీతి లేకుండా ప్రజలకు పథకాలు అందుతున్నాయని తెలిపారు.
టీఆర్ఎస్ పార్టీకి కోరుట్లపెట్టని కోట అన్నారు ఎమ్మెల్సీ కవిత. జగిత్యాల జిల్లాలో ఉన్న అన్ని నియోజకవర్గాలు గెలిచేలా కార్యకర్తలు కృషి చేయాలన్నారు. ప్రజలు కోరిన విధంగా కోరుట్ల, మెట్ పల్లి రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేశామని చెప్పారు. వంద పడకల ఆస్పత్రి ఏర్పాటుతో పాటు ప్రజలకు ఇచ్చిన అనేక హామీలు అమలు చేశామని తెలిపారు. కోరుట్లలో ఉన్న బీడీ కార్మికులకు రెండు వేలు పెన్షన్ ఇస్తున్నామని.. ఇతర రాష్ట్రాల్లో ఉన్న బీడీ కార్మికులకు ఎందుకు ఇవ్వడం లేదని కవిత ప్రశ్నించారు.
READ ALSO: Pawan Kalyan: బీజేపీతో పొత్తు లేనట్టేనా! జనసేన గెలిచే సీట్లు ఇవేనా?
READ ALSO: PM Modi Hyderabad Tour: హైదరాబాద్ లో ప్రధాని మోడీ రోడ్ షో? భారీగా జనసమీకరణకు బీజేపీ ప్లాన్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook
MLC Kavitha Comments: దేవుడి పేరుతో రాజకీయం చేస్తే ఊరుకోం.. బీజేపీకి ఎమ్మెల్సీ కవిత వార్నింగ్
కోరుట్లలో పార్టీ సమావేశంలో పాల్గొన్న కవిత
దేవుడి పేరుతో రాజకీయం చేస్తే ఊరుకోం
బీజేపీతో జీవన్ రెడ్డి మ్యాచ్ ఫిక్సింగ్- కవిత