రైతులను వేధించొద్దు.. రైస్ మిల్లర్లకు మంత్రి వేముల వార్నింగ్

రైతుల శ్రేయస్సు కోరి 30 వేల కోట్ల రూపాయలు వెచ్చించి 100% ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చర్యలు తీసుకోగా మిల్లర్లు మాత్రం తరుగు పేరుతో ఇష్టమొచ్చినట్టు తూకంలో మోసం చేయడం ఎంత మాత్రం క్షంతవ్యం కాదని రాష్ట్ర రోడ్లు-భవనాలు, హౌసింగ్, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.

Last Updated : Apr 25, 2020, 01:24 AM IST
రైతులను వేధించొద్దు.. రైస్ మిల్లర్లకు మంత్రి వేముల వార్నింగ్

నిజామాబాద్: రైతుల శ్రేయస్సు కోరి 30 వేల కోట్ల రూపాయలు వెచ్చించి 100% ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చర్యలు తీసుకోగా మిల్లర్లు మాత్రం తరుగు పేరుతో ఇష్టమొచ్చినట్టు తూకంలో మోసం చేయడం ఎంత మాత్రం క్షంతవ్యం కాదని రాష్ట్ర రోడ్లు-భవనాలు, హౌసింగ్, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. తరుగు పేరుతో రైతులను ఇబ్బంది పెట్టే మిల్లర్లపై క్రిమినల్ కేసులు పెట్టాలని మంత్రి ప్రశాంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం నాడు ఆయన నిజామాబాజ్ జిల్లా కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, సీపీ కార్తికేయ, రూరల్ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ ఇతర అధికారులతో కలిసి ధాన్యం కొనుగోలు, కరోనావైరస్ కట్టడిపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

Also read: Hyderabad: భోజనం అవసరమైతే ఈ నెంబర్‌కి ఫోన్ చేయండి: సీఎస్ సోమేష్ కుమార్

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రం ఇతర రాష్ట్రాలలో ధాన్యాన్ని కొంత శాతం వరకు మాత్రమే సేకరిస్తారని మన రాష్ట్రంలో మాత్రం పూర్తిస్థాయిలో పలురకాల పంట దిగుబడులను కొనుగోలు చేయడానికి పెద్ద ఎత్తున కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు అవసరమైన సదుపాయాలతో వారికి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇప్పటికే తొంబై రెండు వేల చిల్లర మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని కొనుగోలు చేశామని.. అలాగే ఇతర పంటల కొనుగోలు కూడా కొనసాగుతోందని చెప్పారు. 

Also read : అర్నాబ్ గోస్వామిపై రేవంత్ రెడ్డి ఫిర్యాదు

అయితే పెద్ద ఎత్తున దిగుబడి వచ్చిన వరి ధాన్యం కొనుగోలు మన ముందు ఇప్పుడు ఒక సవాలుగా ఉందని చెబుతూ.. హమాలి సమస్య లాక్ డౌన్ వల్ల గన్నీ సంచుల కొరత వలన ఇబ్బందులు ఏర్పడుతున్నాయని అన్నారు. అయినప్పటికీ ప్రభుత్వ యంత్రాంగం ఎప్పటికప్పుడు ఆ సమస్యలను అధిగమించడానికి పలు రకాల చర్యలు తీసుకుంటుందన్నారు. గత కొన్ని రోజులుగా రైస్ మిల్లర్లు రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని.. రైతులను మోసం చేస్తామంటే ఎట్టి పరిస్థితులలోనూ ఉపేక్షించేది లేదని తప్పును గుర్తించి ఆ రైస్ మిల్లులపై క్రిమినల్ కేసులు పెట్టడంతో పాటు మిల్లులను సీజ్ చేయాలని అధికారులను ఆదేశించారు. 

Also read : ఏపీలో తాజాగా 62 కరోనా కేసులు, ఇద్దరి మృతి

మిల్లర్లు మోసం చేస్తే యంత్రాంగం ఎంత మాత్రం ఊరుకోదని.. తప్పనిసరిగా వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి మిల్లులను సీజ్ చేస్తామని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి అన్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News