Himanshu Rao: సీఎం కేసీఆర్ మనవడు హిమాన్షులో సూపర్ టాలెంట్.. మురిసిపోయిన కేటీఆర్

CM KCR Grand Son Himanshu Rao Cover Song: తాత కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా హిమాన్షు కవర్ సాంగ్ రిలీజ్ చేశారు. తనలోని సూపర్ టాలెంట్‌తో అందరినీ ఆశ్చర్యపరిచారు. మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత ప్రశంసల వర్షం కురిపించారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 17, 2023, 11:49 PM IST
Himanshu Rao: సీఎం కేసీఆర్ మనవడు హిమాన్షులో సూపర్ టాలెంట్.. మురిసిపోయిన కేటీఆర్

 CM KCR Grand Son Himanshu Rao Cover Song: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు మనవడు, మంత్రి కేటీఆర్ కొడుకు హిమాన్షు తనలోని సూపర్ టాలెంట్‌ను బయటపెట్టారు. తన తాత పుట్టినరోజు సందర్భంగా తాను పాడిన ఆంగ్ల గీతాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ పాట వైరల్‌గా మారింది. హిమాన్షు తొలిసారిగా ఒక పాటను పాడి.. దాన్ని యూట్యూబ్, ఇతర సామాజిక మాధ్యమ వేదికల ద్వారా పంచుకోవడం విశేషం. ప్రసిద్ధ ఇంగ్లీష్ గీతం గోల్డెన్ అవర్ పాటకు కవర్ సాంగ్ రూపంలో తనలో ఉన్న ఈ కొత్త టాలెంట్‌ను పరిచయం చేశారు. కుమారుడిలోని స్పెషల్ టాలెట్ చూసి మంత్రి కేటీఆర్ మురిసిపోయారు. తన కుమారుడు పాడిన పాట తనకెంతో బాగా నచ్చిందని ఆయన ట్వీట్ చేశారు. మీ కూడా అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నట్లు ట్వీట్ చేశారు. హిమాన్షు పాట తనకు ఎంతో గర్వంగా ఉందని రాసుకొచ్చారు.

 

తన తాతయ్య కేసీఆర్ జన్మదినం సందర్భంగా ఆయన పట్ల ఉన్న ప్రేమను హిమాన్షు ప్రత్యేకంగా చాటుకోవడం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ట్విట్టర్ వేదికగా భావోద్వేగాపూరితంగా తాతయ్యతో తన అనుబంధాన్ని పంచుకున్నారు. తన అత్యంత ప్రియమిత్రుడు.. తన స్పూర్తి ప్రదాత మా తాతయ్య కేసీఆర్ గారు 69 సంవత్సరాల క్రితం ఈ రోజు జన్మించారంటూ ప్రారంభించారు. సామాజిక, నైతిక విలువలను తనకు నేర్పించిన కేసీఆర్ గారికి ధన్యవాదాలు చెప్పారు హిమాన్షు. 

 

ఏ ప్రాతిపదికత వల్ల కూడా ఎవరిని వివక్షతతో చూడకుండా.. అందరినీ సమానంగా చూడగలిగేలా తనను తాతయ్య  తయారు చేశారని చెప్పుకొచ్చారు. ముఖ్యంగా సమాజం పట్ల తనలో సేవా దృక్పథాన్ని నింపిన ఆయనకి ధన్యవాదాలు తెలిపారు. ఎంతో బిజీగా ఉన్నా.. తమ కుటుంబానికి ముఖ్యంగా, తనకోసం అత్యధిక సమయం కేటాయించే తమ తాతయ్య కేసీఆర్ గారు అంటే తనకి ఎంతో ప్రేమ అని చెప్పారు.

హిమాన్షు పాటి పాటపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కూడా రియాక్ట్ అయ్యారు. హిమాన్షుపై ట్విట్టర్‌లో ప్రశంసలు కురిపిస్తూ పోస్ట్ పెట్టారు. 'నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది అల్లుడు.. చాలా మంచి శ్రావ్యమైన స్వరాన్ని వినిపించావు. నీ నుంచి మరిన్ని సాంగ్స్ కోసం ఎదురుచూస్తున్నాం.. గాడ్ బ్లెస్ యూ' అంటూ ట్వీట్ చేశారు.

 

 

Also Read: IPL 2023: రాజస్థాన్ రాయల్స్‌కు భారీ ఎదురుదెబ్బ.. ఆసుపత్రి బెడ్‌పై టీమిండియా స్పీడ్ స్టార్  

Also Read: Geetha Singh: రోడ్డు ప్రమాదంలో హాస్యనటి గీతాసింగ్ కుమారుడు మృతి  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

 మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

  

Trending News