Minister Harish Rao convoy: మంత్రి హరీష్ రావు కాన్వాయ్‌కి ప్రమాదం.. తప్పిన ముప్పు

Minister Harish Rao car meets with an accident: సిద్దిపేట: మంత్రి హరీష్ రావుకు తృటిలో ప్రమాదం తప్పింది. సిద్దిపేటలో అభివృద్ధి కార్యక్రమాలు ముగించుకున్న అనంతరం ఆదివారం రాత్రి మంత్రి హరీష్ రావు  హైదరాబాద్ వెళ్తుండగా హరీష్ రావు కాన్వాయ్‌లోని కార్లు ఒకదానినొకటి ఢీకొన్నాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 21, 2021, 05:43 AM IST
Minister Harish Rao convoy: మంత్రి హరీష్ రావు కాన్వాయ్‌కి ప్రమాదం.. తప్పిన ముప్పు

Minister Harish Rao car meets with an accident: సిద్దిపేట: మంత్రి హరీష్ రావుకు తృటిలో ప్రమాదం తప్పింది. సిద్దిపేటలో అభివృద్ధి కార్యక్రమాలు ముగించుకున్న అనంతరం ఆదివారం రాత్రి మంత్రి హరీష్ రావు  హైదరాబాద్ వెళ్తుండగా హరీష్ రావు కాన్వాయ్‌లోని కార్లు ఒకదానినొకటి ఢీకొన్నాయి. కొండపాక సమీపంలో హరీష్ రావు కాన్వాయ్‌లో (Minister Harish Rao convoy) ముందు వెళ్తున్న కారుకు అడవి పందులు అడ్డుగా రావడంతో ముందు కారు డ్రైవర్ సడెన్‌ బ్రేక్ వేశాడు. దీంతో ఆ కారు వెనుకే వస్తున్న హరీష్ రావు పైలట్ కారు, ఆ పైలట్ కారు వెనకాలే వస్తున్న మంత్రి హరీష్ రావు కారు ఒకదానినొకటి ఢీకొన్నాయి. 

ఈ ప్రమాదంలో ముందు కారులో ఉన్న వారిలో ఒకరికి స్వల్పగాయాలయ్యాయి. కారులోంచి కిందికి దిగి పరిస్థితిని పరిశీలించిన మంత్రి హరీష్ రావు.. గాయాలైన వ్యక్తిని ఆసుపత్రికి పంపించి మరో కారులో అక్కడి నుంచి హైద్రాబాద్ బయల్దేరారు. 

Also read : Telangana CM KCR: సిద్దిపేట కలెక్టర్ ఆఫీసు ప్రారంభించిన సీఎం కేసీఆర్

మంత్రి హరీష్ రావు కాన్వాయ్ ప్రమాదం బారినపడటం ఇది రెండోసారి. గతంలో 2018, మార్చి 17న అప్పటి భారీ నీటి పారుదల శాఖ మంత్రి హోదాలో మేడిగడ్డ బ్యారేజీ పనులు పరిశీలించడానికి వెళ్లి వస్తుండగా కాన్వాయ్‌లో (Harish Rao convoy car catches fire) ముందున్న వాహనంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. సాధారణంగా మంత్రి హరీష్ రావు వినియోగించే కారు అది కానీ ఆరోజు మంత్రి మరో కారులో ఉన్నారు. కారు ఇంజిన్ వేడెక్కడం వల్లే మంటలు చెలరేగినట్టు భద్రతా సిబ్బంది గుర్తించారు.

Also read : Petrol, diesel prices today: రికార్డు స్థాయికి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. టాప్ 7 లిస్టులో తెలంగాణ, ఏపీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News