గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పదవిపై కూర్చునేదెవరు..ఇప్పుడిదే ప్రశ్న ఆసక్తి రేపుతోంది. ఏ పార్టీకు స్పష్టమైన మెజార్టీ రాని నేపధ్యంలో ఏ ఇద్దరు కలుస్తారనే విషయంపై చర్చ సాగుతోంది.
జీహెచ్ఎంసీ ( GHMC Elections ) మేయర్ పీఠమెవరిది..మ్యాజిక్ ఫిగర్ ( Magic figure )ను ఏ పార్టీ చేరుకోకపోవడంతో ఉత్కంఠ రేపుతోంది. ప్రతిష్ఠాత్మక గ్రేటర్ పోరులో బీజేపీ, టీఆర్ఎస్, మజ్లిస్ పార్టీలు దాదాపుగా సమాన సీట్లను పంచుకున్నాయి. 55 సీట్లతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా టీఆర్ఎస్ ఉండగా..రెండో స్థానంలో 48 స్థానాలతో బీజేపీ నిలిచింది. ఇక 51 స్థానాల్లో పోటీ చేసిన మజ్లిస్ పార్టీ 44 స్థానాలు సాధించింది. 150 స్థానాలున్న జీహెచ్ఎంసీ ( Ghmc)లో కావల్సిన మ్యాజిక్ ఫిగర్ 76. టీఆర్ఎస్ మేయర్ పీఠం చేజిక్కించుకోవాలంటే 25 మంది మద్దతు కచ్చితంగా అవసరం.
అటు బీజేపీ ( Bjp) అధికారం చేజిక్కించుకోవాలన్నా 32 మంది మద్దతు అవసరం. అటు మజ్లిస్ పార్టీ ( MIM Party )కు సైతం 36 మంది అవసరం. ఈ నేపధ్యంలో ఏ రెండు పార్టీలైనా కలిస్తేనే మేయర్ పీఠం దక్కుతుంది. మరి ఏ రెండు పార్టీలు కలవనున్నాయనేదే ఇప్పుడు అసలైన ప్రశ్న.
ఈ నేపధ్యంలో టీఆర్ఎస్-మజ్లిస్ ( TRS-Majlis ) పార్టీల మద్య మరోసారి బంధం ఏర్పడుతుందనే వార్తలు విన్పిస్తున్నాయి. ఎందుకంటే మజ్లిస్ పార్టీ మద్దతు లేకుండా మేయర్ పీఠం సాధించడమనేది అసాధ్యం. బీజేపీ-మజ్లిస్ పార్టీల మధ్య బంధం అసాధ్యం కాబట్టి...టీఆర్ఎస్ -మజ్లిస్ పార్టీలు మరోసారి కూటమిగా ఏర్పడి మేయర్ పీఠాన్ని పంచుకునేందుకు అవకాశాలున్నాయి.
వాస్తవానికి ఎంఐఎం పార్టీలో నిర్ణయం తీసుకునేది అసదుద్దీన్ ఒవైసీ మాత్రమే. కానీ తన నిర్ణయాన్ని చెప్పకుండా దాటేసే ధోరణి అవలంభిస్తున్నారు. పార్టీ కార్యకర్తలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పడం విశేషం. చివరి నిమిషం వరకూ సాగదీయాలనేదే ఆయన ఆలోచనగా ఉంది.
టీఆర్ఎస్ పార్టీతో గతంలో అధికారం పంచుకున్న నేపధ్యంలో ఈసారి కూడా అదే పునరావృతమయ్యే అవకాశముంది. Also read: Jana Reddy to join BJP: జానారెడ్డి బీజేపిలో చేరుతున్నారా ? స్పందించిన బండి సంజయ్