హైదరాబాద్ లో మొదలైన మెట్రో సందడి

హైద్రాబాద్ లో మెట్రో సామాన్యులకు బుధవారం అందుబాటులోకి వచ్చింది. దీంతో నగరవాసుల చిరకాల స్వప్నం సాకారమైంది. నేడు ఉదయం ఆరు గంటలకు మెట్రో తొలి కూత పెట్టింది.

Last Updated : Nov 29, 2017, 08:55 AM IST
    • హైదరాబాద్ లో పరుగులు పెట్టిన మెట్రో రైలు
    • నేటి నుంచి సామాన్యులకు అందుబాటులో
    • తొలి ప్రయాణంలో అనుభవాలను పంచుకున్న నగరవాసులు
హైదరాబాద్ లో మొదలైన మెట్రో సందడి

హైద్రాబాద్ లో మెట్రో సామాన్యులకు బుధవారం అందుబాటులోకి వచ్చింది. దీంతో నగరవాసుల చిరకాల స్వప్నం సాకారమైంది. నేడు ఉదయం ఆరు గంటలకు మెట్రో తొలి కూత పెట్టింది. మియాపూర్ నుండి నాగోల్ కు వెళ్లే రైలు..  నాగోల్ నుండి మియాపూర్ కు వెళ్లే రైలు రెండూ అమీర్ పేట్ మెట్రో స్టేషన్ వద్దకు చేరుకున్నాయి. మీకు తెలుసా? అమీర్ పేట్ దేశంలోనే అతిపెద్ద ఇంటర్ఛేంజ్ మెట్రో స్టేషన్ అని. మెట్రో రాకతో నాగోల్-అమీర్ పేట్ మధ్య 40 నిమిషాలకు పైగా టైమ్ ఆదా కానుంది. ప్రతి 15 నిమిషాలకొకసారి స్టేషన్లో మెట్రో రైలు ప్రయాణీకులకు అందుబాటులో ఉంటుంది. 

మెట్రో రైలు ఉదయం 6 నుండి రాత్రి 10 గంటల వరకే నడవనుంది. మెట్రో రైలు లో మొత్తం మూడు కోచ్ లు ఉంటాయి. ఒక్కో కోచ్ లో 330 మంది ప్రయాణించవచ్చు. ఓరల్ గా ఒక మెట్రో రైలులో 1000 మంది ప్రయాణించవచ్చు. ఈ రెండు మార్గాలలో రోజూ మొత్తం 20 మెట్రో రైళ్లు తిరుగుతాయి. ఈ రెండు మార్గాలలో మొత్తం 24 స్టేషన్లు ఉన్నాయి.  మెట్రో టికెట్ గరిష్టం రూ.60, కనిష్టం రూ.20. అయితే ప్రయాణీకుల రద్దీని బట్టి ట్రిప్పులు, కోచ్ ల పెంచడం, తగ్గించడం,టైమ్ లాంటి అంశాలు ఆధారపడి ఉంటాయని అధికారులు చెప్తున్నారు. 

ఇదిలా ఉండగా.. మెట్రో నగరంలో పరుగులు పెట్టడంతో .. సామాన్యులకు అందుబాటులోకి వచ్చిన తొలి రైలులో ప్రయాణించేందుకు నగరవాసులు ఆసక్తి కనబరిచారు. మెట్రో స్టేషన్లలో తొలి టికెట్ తీసుకున్నవారికి అధికారులు బహుమతులు అందజేశారు. మెట్రో రైలులో ప్రయాణించి అనుభవాలను సొంతం చేసుకున్నారు హైదరాబాదీయులు.  సెల్ఫీలతో జ్ఞాపకాలను పదిలం చేసుకున్నారు. ఈ సందర్భంగా కొంత మంది సోషల్ మీడియాతో తమ అనుభవాలను పంచుకున్నారు.

Trending News