Megastar Chiranjeevi tested for Covid-19 positive: హైదరాబాద్: దేశవ్యాప్తంగా కరోనా (Coronavirus) మహమ్మారి రోజురోజుకూ విస్తరిస్తూనే ఉంది. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీలు, ప్రజాప్రతినిధులు అందరూ కరోనా బారిన పడుతున్నారు. తాజాగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) కరోనా మహమ్మారి బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ వేదిక ద్వారా వెల్లడించారు. అయితే తనకు ఎలాంటి లక్షణాలు లేవని చిరంజీవి ట్విట్ చేశారు. ఆచార్య సినిమా షూటింగ్ ప్రారంభించాలని కోవిడ్ టెస్ట్ చేయించుకోగా పాజిటివ్‌గా తేలిందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం తనకు ఎలాంటి కరోనా లక్షణాలు లేవని తెలిపారు. ప్రస్తుతం హోం క్వారంటైన్‌లో ఉన్నానని తెలిపారు గత 4-5 రోజులుగా తనను కలిసిన వారంతా కరోనా టెస్ట్ చేయించుకోవాలని కోరారు. ఈ మేరకు ఎప్పటికప్పుడు తన ఆరోగ్య పరిస్థితిని చెబుతానని అభిమానులకు భరోసానిస్తూ చిరు ట్విట్ చేశారు. Also read: Hyderabad Cinema city: సీఎం కేసీఆర్‌ని కలిసిన చిరు, నాగ్.. 1500-2000 ఎకరాలతో సినిమా సిటీ..
ఆచార్య షూటింగ్ ప్రారంభించాలని,కోవిడ్ టెస్ట్ చేయించుకున్నాను. రిజల్ట్ పాజిటివ్. నాకు ఎలాంటి కోవిడ్ లక్షణాలు లేవు.వెంటనే హోమ్ క్వారంటైన్ అయ్యాను.గత 4-5 రోజులుగా నన్ను కలిసినవారందరిని టెస్ట్ చేయించుకోవాలిసిందిగా కోరుతున్నాను.ఎప్పటికప్పుడు నా ఆరోగ్య పరిస్థితిని మీకు తెలియచేస్తాను. pic.twitter.com/qtU9eCIEwp
— Chiranjeevi Konidela (@KChiruTweets) November 9, 2020
ఇదిలాఉంటే.. రెండు రోజుల క్రితం చిరంజీవి, నాగార్జున (Akkineni Nagarjuna) ఇద్దరూ కలిసి తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు (KCR)ను కలిసిన విషయం తెలిసిందే. అప్పుడు వీరంతా మాస్కులు లేకుండానే కనిపించారు. అయితే చిరంజీవికి కరోనా సోకిందన్న వార్తతో ఇటు ప్రభుత్వ వర్గాల్లో.. అటు సినీ వర్గాల్లో టెన్షన్ మొదలైంది.
తాజాగా మెగాస్టార్ చిరంజీవికి కరోనా పాజిటివ్‌గా నిర్థారన కావడంతో.. ఈ రోజు నుంచి ప్రారంభించాలనుకున్న ఆచార్య సినిమా షూటింగ్ మళ్లీ నిలిచిపోయింది. Also read: Megastar As Acharya: నవంబర్ 9 నుంచి ఆచార్య షూట్...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Chiranjeevi: మెగాస్టార్‌కు కరోనా పాజిటివ్