Social media trolling gadwala Vijayalakshmi and minister ponnam Prabhakar: తెలంగాణలో ప్రస్తుతం ఆషాడ మాసం బోనాలు పండుగ కొనసాగుతుంది.ఈ క్రమంలో గోల్కొండ బోనాలతో పండగకు అంకురార్పణ జరిగింది. అదే విధంగా.. బల్కంపేట అమ్మవారి ఆలయంలో బోనాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. దీనిలో భాగంగా.. అమ్మవారికి కళ్యాణ వేడుక కూడా వైభవంగా జరిగింది. బల్కంపేట అమ్మవారిని దర్శించుకునేందుకు వీఐపీల నుంచి సాధారణ జనాలు వరకు భారీగా తరలి వచ్చారు. మంత్రి పొన్నం ప్రభాకర్, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మిలు కూడా అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చారు. కానీ అక్కడ సరైన విధంగా పోలీసులు రెస్సాన్స్ కాలేదే. ప్రోటోకాల్ ను ఏమాత్రం పట్టించుకోలేదు.
బ్రేకింగ్ న్యూస్
అలిగి టెంపుల్ బయటే కూర్చున్న మంత్రి పొన్నం, మేయర్.
బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణంకు ప్రోటోకాల్ పాటిచడం లేదని అలక. pic.twitter.com/65cz72bxjf
— Telugu Scribe (@TeluguScribe) July 9, 2024
దీంతో మేయర్, మంత్రి పోన్నాల ప్రభాకర్ తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఆలయం బైట ఉండి తమ నిరసన తెలిపారు. చివరకు ఆలయ అధికారులు వచ్చి, సర్ది చెప్పి, అమ్మవారిని ప్రత్యేకంగా దర్శనంచేయించారు. ఇదిలా ఉండగా.. మంత్రి పొన్నం, మేయర్ చాలా సేపు బైట ఉండి, సీరియస్ గా మాట్లాడుకున్నారు. ఫోన్ లలో ఉన్నతాధికారులపై మండిపడ్డారు. వీఐపీల పరిస్థితి ఇలా ఉండే.. మాములు జనం పరిస్థితి ఏంటని కూడా మండిపడ్డారు. ఈ నేపథ్యంలో మంత్రి, మేయర్ లు కాస్తంత దగ్గరగా కూర్చున్నారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఇంకేముంది ట్రోలర్స్ రంగంలోకి దిగారు.
మేయర్, మంత్రిల మీద అసభ్యమైన కామెంట్లు చేస్తు, ట్రోలింగ్ చేశారు. దీంతో ఈ ఘటన కాస్త మేయర్ వరకు వెళ్లింది. దీనిపై జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మిలు సీరియస్ గా స్పందించారు. కాగా.. ఈ విషయంపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు మేయర్ గద్వాల విజయలక్ష్మి కలిసి ఫిర్యాదు చేశారు. ‘‘సోషల్ మీడియాలో నాపై అసభ్యకర వీడియోలు పోస్ట్ చేస్తున్నారని, వ్యక్తిగత ప్రతిష్టను దిగజార్చే విధంగా వీడియోలు ఉన్నాయి.
రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో పాటు నన్ను ట్రోల్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో అసభ్యకర వీడియోలు పోస్ట్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో మేయర్ ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఈ సంఘటనను పలువురు మంత్రులు, కాంగ్రెస్ నేతలు ఖండించారు. ఈ ఘటన మాత్రం వైరల్ గా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి