Weather Live Updates in Telugu: భారత వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. ఈ నెల 19న అండమాన్ తీరాన్ని నైరుతి రుతుపవనాలు తాకనున్నట్లు వెల్లడించింది. నెలాఖరులో కేరళను నైరుతి రుతుపవనాలు తాకే అవకాశం ఉందని తెలిపింది. ఆ తర్వాత వారంలో ఏపీలోకి నైరుతి రుతుపవనాల ప్రవేశిస్తాయని పేర్కొంది. ఉపరితల ఆవర్తనం ,ద్రోణి ప్రభావంతో కేరళ, తమిళనాడులో వర్షాలు.. కోస్తాంధ్ర, సీమ జిల్లాల్లోనూ తేలికపాటి వర్షాలు కురుస్తాయంది గతేడాది కంటే ఈ ఏడాది ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది. మరోవైపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల వర్షం కురుస్తోంది. సంగారెడ్డిలోనూ ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. వర్షం కురుస్తున్నప్పుడు చెట్ల కింద ఉండరాదని, పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రజలను అప్రమత్తం చేసింది. వర్షానికి సంబంధించి లైవ్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ ఫాలో అవ్వండి..