Hyderabad Rains LIVE Updates: హైదరాబాద్‌లో దంచికొట్టిన వాన.. ఇవాళ తెలంగాణలోని పలు జిల్లాలకు భారీ వర్ష సూచన..

Hyderabad Rains LIVE Updates: హైదరాబాద్‌లో భారీ వర్షాలు దంచి కొడుతున్నాయి. సోమవారం (ఆగస్టు 1) నగరంలోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది.

Written by - Srinivas Mittapalli | Last Updated : Aug 2, 2022, 02:15 PM IST
 Hyderabad Rains LIVE Updates: హైదరాబాద్‌లో దంచికొట్టిన వాన.. ఇవాళ తెలంగాణలోని పలు జిల్లాలకు భారీ వర్ష సూచన..
Live Blog

Hyderabad Rains LIVE Updates: హైదరాబాద్‌లో భారీ వర్షాలు దంచి కొడుతున్నాయి. సోమవారం (ఆగస్టు 1) నగరంలోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మల్కాజ్‌గిరి పరిధిలోని పలు కాలనీల్లోకి మురుగు నీరు చేరింది. షిర్డీ నగర్, సఫిల్ కాలనీ మధ్య ఉన్న నాలా నుంచి వరద కాలనీల్లోకి వచ్చింది. దీంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నగరంలో నిన్న అత్యధికంగా ఈస్ట్ ఆనంద్ బాగ్‌లో 8.4 సెం.మీ వెస్ట్ మారేడ్‌పల్లిలో 8.1 సెం.మీ వర్షపాతం నమోదైంది. మొత్తంగా ఈసారి సీజన్ ఆరంభంలోనే తెలంగాణను భారీ వర్షాలు, వరదలు ముంచెత్తుతున్నాయి. హైదరాబాద్ సహా తెలంగాణలో భారీ వర్షాలపై లైవ్ అప్‌డేట్స్ మీకోసం... 
 

2 August, 2022

  • 12:11 PM

    నేటి ఉదయం 8.30 గంటల వరకు తెలంగాణలోని ఆయా జిల్లాల్లో నమోదైన వర్షపాతం

    జోగులాంబ గద్వాల్ జిల్లాలోని ఆలంపూర్‌లో 9.5 సెం.మీ వర్షపాతం
    జోగులాంబ గద్వాల్ జిల్లాలోని మల్దకల్‌లో 9.4 సెం.మీ వర్షపాతం
    వరంగల్ అర్బన్‌ హన్మకొండలో 8.2 సెం.మీ
    నల్గొండలోని మర్రిగూడలో 7.9సెం.మీ
    జోగులాంబ గద్వాల్ జిల్లా గట్టు ప్రాంతంలో 7.3 సెం.మీ వర్షపాతం 

  • 11:42 AM

    లేటెస్ట్ వెదర్ అప్‌డేట్ 

    నిన్నటి ఉత్తర - దక్షిణ ద్రోణి ఈరోజు కూడా దక్షిణ ఛత్తీస్ గడ్ నుండి తెలంగాణ, రాయలసీమతో పాటు తమిళనాడు మీదుగా కొమరం ప్రదేశం వరకు  విస్తరించింది. సగటు సముద్ర మట్టం నుండి 0.9 కి మీ ఎత్తు వద్ద స్థిరంగా కొనసాగుతోంది.

    నిన్న తమిళనాడు కోస్తా తీరం పరిసర ప్రాంతాలలో ఉన్న ఆవర్తనం ,ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కోస్తా తీరంలోని పశ్చిమ మధ్య పరిసర ప్రాంతాలలో ఉన్న నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతోంది. సగటు సముద్ర మట్టం నుండి 1.5 కి మీ ఎత్తు వద్ద ఉంది.

    ఈ ప్రభావంతో తెలంగాణలో రాగల 3 రోజులు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురవనున్నాయి.

  • 11:41 AM

    తెలంగాణలో అత్యధికంగా నల్గొండ జిల్లాలో 38 డిగ్రీల ఉష్ణోగ్రత, అత్యల్పంగా మహబూబ్ నగర్‌లో 28.1 డిగ్రీల ఉష్ణోగ్రత 

  • 09:09 AM

    హైదరాబాద్ రెయిన్ అలర్ట్ 

    హైదరాబాద్‌లో ఇవాళ ఆకాశం మేఘావృతమై ఉంటుంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. 

     

  • 08:57 AM

    రికార్డు స్థాయి వర్షపాతం 

    తెలంగాణలో జూలై సగటు వర్షపాతం 28.1 సెం.మీ కాగా ఈసారి ఏకంగా 53.5 సెం.మీ వర్షపాతం నమోదైంది. ఇంత భారీ స్థాయిలో వర్షాలు చాలా అరుదని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు.

  • 08:53 AM

    అయితే ఉక్కపోత.. లేకపోతే కుండపోత..

    తెలంగాణలో అయితే ఉక్కపోత, లేకపోతే కుండపోత అన్నట్లుగా ఉంది పరిస్థితి. వర్షం లేని రోజు ఉష్ణోగ్రతలు పెరిగి ఉక్కపోతతో జనం అల్లాడిపోతున్నారు. వర్షం ఉన్న రోజు ఎడతెరిపిలేని వానలతో ఇబ్బందులు పడుతున్నారు.

  • 08:48 AM

    అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దు :

    హైదరాబాద్ ప్రజలకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కీలక విజ్ఞప్తి చేశారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దన్నారు. ట్రాఫిక్ ఎక్కువగా ఉండే సమయాల్లో ప్రయాణం చేయొద్దని, పిల్లలను బయటకు పంపించవద్దని సూచించారు. 

  • 08:45 AM

    రాబోయే 3 గంటల్లో ఈ జిల్లాల్లో వర్షాలు 

    రాబోయే 3 గంటల్లో గద్వాల్, వనపర్తి, నారాయణపేట, మహబూబ్ నగర్, నాగర్‌కర్నూల్,నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, సంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, యాదాద్రి జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, గంటకు 30 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది.

  • 08:44 AM

    ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ :

    హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి, యాదాద్రి భువనగిరి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్, వరంగల్ అర్బన్, వికారాబాద్ రూరల్

Trending News