తెలంగాణలో ప్రముఖ గిరిజన ఉత్సవం మేడారం జాతర ప్రారంభమైంది. ఈ జాతరలో పాల్గొనడానికి తెలంగాణ నుండి మాత్రమే కాకుండా వివిధ ప్రాంతాలను నుండీ ఎందరో భక్తులు రావడం విశేషం. దేశ, విదేశాల నుండి కూడా పలువురు ఈ జాతరకు వస్తున్నారు. ఈ రోజు చంద్రగ్రహణం కావడంతో కూడా ఈ జాతరకు ప్రాధార్యం సంతరించుకుంది. అలాగే తెల్ల బంగారాన్ని (బెల్లం) అమ్మవారికి కానుకగా ఇవ్వడానికి కూడా చాలామంది భక్తులు పోటీ పడి ఈ జాతరకు రావడం నిజంగానే విశేష ప్రాధాన్యం పొందింది. మేడారంలో సమ్మక్కను, సారలమ్మను గద్దెలపైకి తీసుకురావడానికి చాలా సమయం ఉండడంతో ఈ లోపుగా అనేకమంది భక్తులు వచ్చి సందడి చేస్తున్నారు. ఆదివాసీలు ఇక్కడకు వచ్చి జంపన్నవాగులో స్నానాలు చేయడం వల్ల తమ సమస్యలు తీరుతాయనే నమ్మకంతో ఇక్కడకు వస్తారు. దాదాపు 10 వేలమంది పోలీసులతో భారీ బందోబస్తును తెలంగాణ ప్రభుత్వం ఈ జాతర నిమిత్తం ఏర్పాటు
చేయడం గమనార్హం.
మంగళవారం సాయంత్రానికే కొన్ని లక్షలాది మంది భక్తులు మేడారం చేరుకున్నారు. ఈ జాతర కోసం టీఆర్టీసీ ప్రత్యేక రవాణా సదుపాయం కల్పిస్తోంది. బుధవారం సాయంత్రం సారలమ్మ గద్దె మీదకు చేరుకున్నాక, భక్తులు పూనకంతో ఊగిపోతూ ఆమెను కీర్తిస్తారు. అలాగే గురువారం సమ్మక్క గద్దె మీదకు వస్తుంది. శుక్రవారం సమ్మక్క, సారలమ్మలతోపాటు పగిడిద్దరాజు ఆయన తమ్ముడు గోవింద రాజులు కూడా గద్దెల మీదే పూజాధికాలు అందుకుంటారు. జాతర చివరి రోజున పగిడిద్ద రాజు సమ్మక్కను పెళ్లాడడం ఇక్కడ సంప్రదాయం.