AP, Telangana Weather IMD Live Updates: ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. లైవ్ అప్‌డేట్స్

AP, Telangana Weather IMD Live Updates: ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. లైవ్ అప్‌డేట్స్

Last Updated : Jul 8, 2022, 07:05 PM IST
  • AP, Telangana Weather IMD Live Updates: ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. లైవ్ అప్‌డేట్స్. హైదరాబాద్‌లో భారీ వర్షాలు. విజయవాడలో భారీ వర్షాలు. తెలంగాణకు రేపు భారీ వర్ష సూచన
AP, Telangana Weather IMD Live Updates: ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. లైవ్ అప్‌డేట్స్
Live Blog

AP, Telangana Weather IMD Live Updates: ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. లైవ్ అప్‌డేట్స్

8 July, 2022

  • 19:03 PM

    IMD Hyderabad chief officer K Nagaratna: వాయువ్య దిశతో పాటు దానిని ఆనుకున్నటువంటి పశ్చిమ బంగాళాఖాతం, దక్షిణ ఒడిషా, ఉత్తరాంధ్రప్రదేశ్ తీరం వెంబడి 7.6 కిలో మీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తనం ద్రోణి కొనసాగుతున్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం చీఫ్ ఆఫీసర్ నాగరత్న తెలిపారు. ఈ వాతావరణ మార్పుల కారణంగా తెలంగాణలో కొన్ని చోట్ల తేలికపాటి జల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని.. అలాగే ఇంకొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు, మరికొన్ని చోట్ల అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని నాగరత్న వివరించారు.

  • 17:32 PM

    Telangana Weather Report Live Updates: మంచిర్యాల జిల్లా, జగిత్యాల జిల్లా, కరీంనగర్, పెద్దపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం నలుమూలలా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రేపు ఈ భారీ వర్షాల ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉంది.

Trending News