కాంగ్రెస్‌తో టీడీపీ పొత్తుకు ఎన్టీఆర్ ఫోటో వాడుకోవద్దు !

కాంగ్రెస్‌తో టీడీపీ పొత్తుకు ఎన్టీఆర్ ఫోటో వాడుకోవద్దట !

Last Updated : Nov 3, 2018, 10:20 PM IST
కాంగ్రెస్‌తో టీడీపీ పొత్తుకు ఎన్టీఆర్ ఫోటో వాడుకోవద్దు !

కాంగ్రెస్ పార్టీతో టీడీపీ పొత్తా..! అన్ని పార్టీలతో పొత్తులు పెట్టుకోవడం అయిపోయింది ఆఖరికి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వంతు వచ్చిందా ? ఏ కాంగ్రెస్ పార్టీకి, ఢిల్లీ పెత్తనానికి వ్యతిరేకంగా పోరాడేందుకు స్వర్గీయ ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారో... అదే టీడీపీని నేడు చంద్రబాబు అదే ఢిల్లీలో రాహుల్ గాంధీ కాళ్ల దగ్గర తాకట్టు పెట్టారు అని లక్ష్మీపార్వతి ఆవేదన వ్యక్తంచేశారు. తెలంగాణలో జరగనున్న ఎన్నికల్లో టీడీపీ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవడంపై నిరసన వ్యక్తంచేస్తూ ఆమె ఇవాళ ఎన్టీఆర్ ఘాట్ వద్ద మౌనదీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని ఆమె తీవ్రంగా వ్యతిరేకించారు. ఎన్టీఆర్ ఆశయాలకు చంద్రబాబు తీసుకున్న నిర్ణయం, ఎంచుకున్న మార్గం వ్యతిరేకం అవుతుంది అని అన్నారామె. 

టీడీపీలోని చాలా మంది సీనియర్ నేతలు సైతం కాంగ్రెస్‌తో పొత్తును వ్యతిరేకిస్తున్నారు. అయినా సరే కాంగ్రెస్ పార్టీతోనే పొత్తు పెట్టుకోవాలని చంద్రబాబు భావిస్తే, అందుకు తమకు ఏ అభ్యంతరం లేదు కానీ.. ఆ పొత్తు ప్రయోజనాల కోసం ఎన్టీఆర్ ఫోటోను వాడుకోవద్దు అని లక్ష్మీపార్వతి విజ్ఞప్తిచేశారు. అదేకానీ జరిగితే, అది చూసి ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుంది అని లక్ష్మీపార్వతి అసంతృప్తి వ్యక్తంచేశారు.
 

Trending News