కోదండరాం కౌంటర్: మంత్రులకే దొరకిని ఏకైక సీఎం కేసీఆర్

Last Updated : Dec 4, 2017, 08:26 PM IST
కోదండరాం కౌంటర్: మంత్రులకే దొరకిని ఏకైక సీఎం కేసీఆర్

తెలంగాణ సాధించామని డబ్బాకొట్టుకోవడం తప్పితే ఇప్పటి వరకు చేసింది ఏమీ లేదని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కోదండరాం విమర్శించారు. హైద‌రాబాద్‌లోని స‌రూర్‌న‌గ‌ర్‌లో  'కొలువుల‌కై కొట్లాట' స‌భ‌లో టీజేఏసీ ఛైర్మన్ ప్రొ.కోదండ‌రాం కేసీఆర్, ఆయన ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ కు  భూముల దందా, కాంట్రాక్టుల మీద చూపిస శ్రద్ధ యువతకు కొలువులు ఇచ్చే విషయంలో ఉండటం లేదని విమర్శించారు.   మన ముఖ్యమంత్రి..మంత్రులకే అందుబాటులో ఉండటం లేదు..ఇక ప్రజలకు ఏం అందుబాటులో ఉంటారని ఎద్దేవ చేశారు. సచివాలయానికి వచ్చే తీరిన సీఎం కేసీఆర్ కు లేదని కోదండరాం విమర్శించారు. 

 విద్యార్ధులు ప్రశ్నిస్తున్నారు..

యువత ఉద్యోగాల కోసం అప్పు తెచ్చి మరి శిక్షణ కేంద్రాల్లో కోచింగ్ తీసుకుంటారు.  ఖాళీ క‌డుపుల‌తో ఉద్యోగాల కోసం ఆశ పెట్టుకుని చ‌దువుతున్నారు.. ఇంత చేస్తున్నా ప్రభుత్వ ఉద్యోగాలు ఎందుకు ఇవ్వడం లేదని విద్యార్ధులు అడుగుతున్నారు. యువ‌త‌ భ‌విష్యత్తుపై మీద ఆశ‌ను కోల్పోయి ఉంది...ఇది ముమ్మాటికి ప్రభుత్వ వైఫల్యమేని ఆరోపించారు. విద్యార్థుల‌కు, యువ‌త‌కు ఓ ఆశ, విశ్వాసాన్ని క‌ల్పించ‌డంలో స‌ర్కారు పూర్తిగా విఫ‌ల‌మైంది. వాస్తవానికి తెలంగాణ ఏ ఒక్కరో..ఏ ఒక్క పార్టీ నో సాధించింది కాదని..అంద‌రం క‌లిసి కొట్లాడితే తెలంగాణ వ‌చ్చిందన్నారు. పోరాటంతో తెలంగాణ సాధించుకున్న తమకు కొలువులు ఎలా సాధించుకోవాలో తెలుసుసని కోదండరాం అన్నారు.

కొలువుల సాధ‌న అసాధ్యమేమి కాదు..
ప్రజా సమస్యలపై కొట్లాడుతుంటే మేము రాజకీయాలు చేస్తున్నామని విమర్శించడం సరికాదన్నారు. కలుషితమైన రాజకీయాలను మార్చుకుందాం.. ఇది మ‌న తెలంగాణ.. మ‌న కోసం తెచ్చుకున్న తెలంగాణ. చావు ప‌రిష్కారం కాదు..విద్యార్థులు పోరాడాలి గానీ ఆత్మహత్యలు వ‌ద్దని..తెలంగాణ తెచ్చుకున్న వారికి కొలువుల సాధ‌న అసాధ్యమేమి కాదు' అని కోదండరాం ఉద్వేగపూరితంగా అన్నారు.

Trending News