/telugu/photo-gallery/allu-konidela-family-dispute-over-allu-aravind-meets-to-pawan-kalyan-with-tollywood-producers-rv-145114 Pawan Allu Aravind: పవన్‌ కల్యాణ్‌ భేటీలో అనూహ్య పరిణామం.. అల్లు అరవింద్‌ ప్రత్యక్షం Pawan Allu Aravind: పవన్‌ కల్యాణ్‌ భేటీలో అనూహ్య పరిణామం.. అల్లు అరవింద్‌ ప్రత్యక్షం 145114

మహబూబాబాద్‌ జిల్లా కేంద్రానికి చెందిన కుసుమ దీక్షిత్‌రెడ్డి(9) కిడ్నాప్‌ కథ విషాదాంతమైంది. దీక్షిత్‌రెడ్డి కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. కానీ బాలుడ్ని ప్రాణాలతో కాపాడలేకపోయారు. కిడ్నాప్‌నకు గురై నాలుగు రోజులు గడిచిన తర్వాత దీక్షిత్ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. కుమారుడి మరణవార్త తెలుసుకున్న దీక్షిత్ రెడ్డి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. 

మహబూబాబాద్‌లోని కృష్ణ కాలనీలో రంజిత్‌, వసంత దంపతులు నివాసం ఉంటున్నారు. వీరి పెద్ద కుమారుడు దీక్షిత్‌రెడ్డి(9) ఇంటి ముందు ఆడుకుంటుండగా ఆదివారం సాయంత్రం గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. బైకుపై వచ్చిన దుండగుడు దీక్షిత్‌రెడ్డిని కిడ్నాప్ చేశాడని అతడి స్నేహితులు తెలిపారు. రాత్రి వరకు వెతికిన ప్రయోజనం లేకపోయింది. కిడ్నాపర్లు బాలుడి తల్లి వసంతకు కాల్ చేసి రూ.45 లక్షలు ఇస్తే దీక్షిత్ రెడ్డిని విడిచిపెడతామని, విషయం ఎవరికి చెప్పవద్దని బెదిరించారు. 

 

బాలుడికి జ్వరం వచ్చిందని ట్యాబ్లెట్లు వేశామని కిడ్నాపర్ మాయమాటలు చెప్పాడు. అయితే డబ్బు సాధ్యమైనంత త్వరగా తెచ్చి అప్పగిస్తామని దీక్షిత్ తల్లిదండ్రులు కిడ్నాపర్‌ను వేడుకున్నారు. బుధవారం కొంత డబ్బుతో కిడ్నాపర్ చెప్పిన చోటుకు బాలుడి తండ్రి వెళ్లినట్లు సమాచారం. ఈ క్రమంలో గురువారం ఉదయం బాలుడు దీక్షిత్‌రెడ్డి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. దీంతో బాలుడి కిడ్నాప్ కేసు విషాదాంతమైంది. 

Photo Gallery: Cricketer Wedding Photoshoot: మహిళా క్రికెటర్ వెడ్డింగ్ ఫొటోషూట్‌కు నెటిజన్లు ఫిదా

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Section: 
English Title: 
Kidnapped boy found dead in Mahabubabad
News Source: 
Home Title: 

బాలుడి కిడ్నాప్ కథ విషాదాంతం.. కేసు ఛేదించిన పోలీసులు

Mahabubabad Boy Murder: బాలుడి కిడ్నాప్ కథ విషాదాంతం.. కేసు ఛేదించిన పోలీసులు
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
Mahabubabad Boy Murder: బాలుడి కిడ్నాప్ కథ విషాదాంతం.. కేసు ఛేదించిన పోలీసులు
Publish Later: 
No
Publish At: 
Thursday, October 22, 2020 - 10:47
Created By: 
Shankar Dukanam
Updated By: 
Shankar Dukanam
Published By: 
Shankar Dukanam