Mynampalli Hanmantha Rao: మైనంపల్లిపై కేసీఆర్ యాక్షన్ తీసుకుంటారా

Mynampalli Hanmantha Rao Comments on Harish Rao: మైనంపల్లి హన్మంత రావు వ్యాఖ్యలపై సీఎం కేసీఆర్ తన ప్రెస్ మీట్‌లో స్పందిస్తూ.. " పార్టీలో ఉండాలి అనుకునే వారు ఉంటారు.. వద్దనుకునే వారు వెళ్లిపోతారు " అని అసహనం వ్యక్తంచేయడం కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ విమర్శలపై మైనంపల్లి హన్మంత రావు ఏం చేస్తారు, ఎలా స్పందిస్తారు అనేదే ప్రస్తుతానికి ఆసక్తికరంగా మారింది.

Written by - Pavan | Last Updated : Aug 22, 2023, 08:45 AM IST
Mynampalli Hanmantha Rao: మైనంపల్లిపై కేసీఆర్ యాక్షన్ తీసుకుంటారా

Mynampalli Hanmantha Rao Comments on Harish Rao: దిక్కులేక, టీడీపీకి రాష్ట్రంలో ఉనిక లేని పరిస్థితుల్లో రాజకీయ పునరావాసం కోసం బీఆర్‌ఎస్ పార్టీలో చేరిన మైనంపల్లి హనుమంత రావుకు మొదటి నుంచి నోటి దురుసు వ్యాఖ్యలు చేయడం అలవాటుగా మారింది అని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు మండిపడ్డారు. మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత రావు మంత్రి హరీశ్ రావుపై చేసిన రబ్బర్ చెప్పులు కామెంట్స్ ని ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు తీవ్రంగా ఖండించారు. 

ఈ సందర్భంగా తక్కెళ్లపల్లి రవీందర్ రావు.. మంత్రి హరీశ్‌ రావు గురించి మాట్లాడుతూ, ఆయన ఒక నిఖార్సయిన తెలంగాణ ఉద్యమకారుడు అని కొనియాడారు. టీఆర్‌ఎస్ ఆవిర్భావం నుంచి ఉద్యమంలో కీలకంగా పని చేసిన నాయకుడు హరీశ్ రావు అని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణ మొత్తం కాలుకు బలపం కట్టుకుని తిరిగిన అలుపెరగని నేత. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు బీఆర్‌ఎస్ పార్టీ కీలక నేతగా, రాష్ట్ర మంత్రిగా హరీష్‌ రావు పార్టీ కోసం, ప్రభుత్వంలో కీలకంగా కొనసాగుతున్నారు అని రవీందర్ రావు వ్యాఖ్యానించారు.
 
బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా, ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా మైనంపల్లి హన్మంత రావు ఏ విషయం అయినా పార్టీలో అంతర్గతంగా చర్చిస్తే బాగుంటుంది కానీ ఇలా పబ్లిగ్గా ఒక హోదాలో ఉన్న నాయకులను కించపరిచేలా మాట్లాడటం సబబు కాదు అని మైనంపల్లి హన్మంత రావుకు తక్కెళ్లపల్లి రవీందర్ రావు హితవు పలికారు. ఇది ఒక నాయకుడికి ముఖ్యంగా ఎమ్మెల్యే హోదాలో ఉన్న వ్యక్తికి తప్పనిసరిగా ఉండాల్సిన కామన్‌ సెన్స్​ అని మైనంపల్లిపై తక్కెళ్లపల్లి మండిపడ్డారు.

మైనంపల్లి హన్మంత రావు గతంలోనూ చాలాసార్లు చేసినట్లుగా ఈసారి కూడా వ్యక్తిగత విచక్షణ కోల్పోయి ఏదో మాట్లాడినట్లు ఉన్నారు. కానీ మైనంపల్లి బెదిరంపు మాటలు గతంలో ఎక్కడైనా చెల్లుబాటు అయ్యాయేమోగానీ బీఆర్‌ఎస్ పార్టీలో చెల్లుబాటు కావు అని హెచ్చిరించారు. మైనంపల్లి హన్మంత రావు సోయి లేకుండా గతంలో ఏం మాట్లాడినా చెల్లింది కానీ ఇకపై అలా కుదరదని హెచ్చరించిన తక్కెళ్లపల్లి.. మంత్రి హరీష్‌ రావుపై మైనంపల్లి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం అని మండిపడ్డారు. మంత్రి హరీశ్ రావుపై మైనంపల్లి హన్మంత రావు తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవడంతో పాటుగా, వెంటనే మంత్రి హరీశ్ రావుకి బేషరతుగా క్షమాపణ చెప్పాలి అని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు డిమాండ్ చేశారు.

ఇదిలావుంటే, మంత్రి హరీశ్ రావుకి మద్దతుగా మంత్రిగా కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కూడా మైనంపల్లి హన్మంత రావు వ్యాఖ్యలను ఖండిస్తూ ట్వీట్స్ చేశారు. తాజాగా అదే పార్టీకి చెందిన తక్కళ్ళపల్లి రవీందర్ రావు వంతు వచ్చింది. మైనంపల్లి హన్మంత రావు వ్యాఖ్యలపై సీఎం కేసీఆర్ తన ప్రెస్ మీట్‌లో స్పందిస్తూ.. " పార్టీలో ఉండాలి అనుకునే వారు ఉంటారు.. వద్దనుకునే వారు వెళ్లిపోతారు " అని అసహనం వ్యక్తంచేయడం కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ విమర్శలపై మైనంపల్లి హన్మంత రావు ఏం చేస్తారు, ఎలా స్పందిస్తారు అనేదే ప్రస్తుతానికి ఆసక్తికరంగా మారింది. 

ఇది కూడా చదవండి : Chandrababu Meeting with Telangana TDP: తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో పోటీపై చంద్రబాబు క్లారిటీ

మైనంపల్లి హన్మంత రావు వెనక్కి తగ్గి హరీశ రావుకి క్షమాపణలు చెబుతారా లేక ఈ వివాదాన్ని ఇలాగే కంటిన్యూ చేసి అధినేత కేసీఆర్ ఆగ్రహానికి గురవుతారా అనేదే ఇప్పుడు తేలాల్సిన అంశం. ఎన్నికలకు ఇంకా సమయం ఉన్న నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపిక నిర్ణయంలో ఎప్పుడైనా, ఏ నిర్ణయమైనా తీసుకునే స్వేచ్ఛాధికారాలు ఆ పార్టీ అధినేతగా కేసీఆర్ చేతుల్లో ఉంటాయి కనుక భవిష్యత్తులో మరొక నేత ఇలా గీత దాటిపోకుండా ఉండటం కోసం ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంది.

ఇది కూడా చదవండి : KTR and Kavitha: హన్మంత రావు పేరు ఎత్తకుండానే ఘాటుగా స్పందించిన కేటీఆర్, కవిత

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News