Karvy Group Case: కార్వీ కుంభకోణంలో తోడు దొంగలు వాళ్లే.. వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టారు!

ED investigates on Karvy Group case: కార్వీ కుంభకోణంలో ఆ సంస్థ ఛైర్మన్‌ పార్థసారథితో పాటు సీఎఫ్‌వో కృష్ణహరిని కస్టడీలోకి తీసుకున్న ఈడీ అధికారులు.. ఈ నెల 30 వరకు వీరిద్దరినీ విచారించనున్నారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 28, 2022, 08:54 AM IST
  • కార్వీ కుంభకోణంపై కొనసాగుతోన్న ఈడీ విచారణ
  • ప్రధాన కుట్రదారులుగా తేలిన సీఎండీ, సీఎఫ్‌ఓ
  • నిధుల్ని మళ్లించడం, బ్యాంకుల్లో అక్రమంగా రుణాలు పొందడం అంతా వారి పనే
  • ఈడీ విచారణలో వెలుగులోకి వచ్చిన ఆసక్తకర విషయాలు
Karvy Group Case: కార్వీ కుంభకోణంలో తోడు దొంగలు వాళ్లే.. వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టారు!

Karvy Group Case Updae: కార్వీ సంస్థ సీఎండీ కొమండూరు పార్థసారథిని ఈడీ అధికారులు కస్టడీలోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఇటీవలే పార్థసారథి బెంగళూరులో అరెస్టు చేసి చంచల్‌గూడ జైలుకు తరలించారు. జైలు నుంచి పార్థసారథిని కస్టడీలోకి తీసుకున్న అధికారులు ముందుగా ఆయనకు వైద్య పరీక్షల తర్వాత ఈడీ కార్యాలయానికి తీసుకెళ్లారు.

ఇక కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌ లిమిటెడ్‌ కుంభకోణంలో ఈడీ విచారణ సాగుతూనే ఉంది. ఈ విచారణలో పలు విషయాలు వెల్లడయ్యాయి. కార్వీ సీఎండీ పార్థసారథి, (Karvy Group CMD) సీఎఫ్‌వో కృష్ణహరిలను ఈడీ విచారిస్తోంది. ఈ కుంభకోణానికి కీలక సూత్రధారులంటూ వీరిద్దరే అని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ నిర్ధారణకు వచ్చింది. 

షేర్‌హోల్డర్స్‌కు తెలియకుండానే వారి షేర్స్‌ను బ్యాంక్‌లలో తనఖా పెట్టి రుణాలు పొందడమే కాకుండా డొల్ల కంపెనీల ద్వారా ఆ నిధుల్ని మళ్లించడం అంతా కూడా సీఎండీ పార్థసారథి, (Parthasarathy) సీఎఫ్‌వో కృష్ణహరిల పనే అని ఈడీ విచారణలో తేలింది. 

కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌ లిమిటెడ్‌ కుంభకోణం అంతా కూడా సీఎండీ పార్థసారథి, సీఎఫ్‌వో కృష్ణహరిల (Krishna Hari) ఆదేశాలతోనే జరిగినట్లు ఈడీ అధికారుల విచారణలో వెల్లడైంది. ఇప్పటి వరకు ఈడీ సేకరించిన సమాచారం మేరకు ఈ ఇద్దరు నిందితులు తమ ఖాతాదారుల షేర్లకు సంబంధించి 2,873.82 కోట్ల రూపాయలను అక్రమంగా మళ్లించారని తేలింది.

ఇందుకోసం కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌ (Karvy Stock Broking) లిమిటెడ్‌ 14 డొల్ల కంపెనీలను సృష్టించింది. షేర్లను తనఖా పెట్టి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో 400 కోట్ల రూపాయల రుణం పొందింది. ఈ డబ్బును కార్వీ సంస్థల అప్పుల చెల్లింపునకు వినియోగించినట్లు పార్థసారథి, కృష్ణ హరి ఈడీ విచారణలో ఒప్పుకున్నట్లు తెలిసింది.

Also Read: New Liquor Policy: ఇక నుంచి కిరాణా షాపులు, సూపర్ మార్కెట్లలో ఫుల్‌గా మందు

కార్వీ రియల్టీతో పాటు మరో తొమ్మిది కంపెనీల పేరు మీదకు మళ్లించిన షేర్లతో నాన్‌బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీల ద్వారా రుణాలు పొందేందుకు కూడా ప్రయత్నించారు. ఆ తర్వాత రెండు ప్రైవేట్‌ బ్యాంకుల ద్వారా రెండువేల కోట్ల రూపాయలకు పైగా రుణం పొందినట్టు ఈడీ (ED) అధికారులు గుర్తించారు.ఇక ఈ కుంభకోణానికి సంబంధించిన పూర్తి వివరాల్ని రాబట్టేందుకు ఈడీ విచారణ (Investigation) కొనసాగిస్తోంది.

Also Read:  Trai Guidelines: ఇక నుంచి మొబైల్ ఫోన్స్ రీఛార్జ్ ప్లాన్స్‌లో 30 రోజుల కాలవ్యవధి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News