Karate Kalyani slaps Srikanth Reddy : యూ ట్యూబర్ శ్రీకాంత్‌రెడ్డి చెంప చెళ్లుమనిపించిన కరాటే కల్యాణి

Karate Kalyani slaps Srikanth Reddy : యూ ట్యూబర్ శ్రీకాంత్‌రెడ్డి చెంప చెళ్లుమనిపించిన కరాటే కల్యాణి.. ప్రాంక్ వీడియోలపై కరాటే కల్యాణి ఆగ్రహం.. సమాజాన్ని ఏం చేస్తారంటూ శ్రీకాంత్‌తో వార్.. మహిళ అని చూడకుండా కల్యాణిపై దాడి చేసిన శ్రీకాంత్

Written by - ZH Telugu Desk | Last Updated : May 13, 2022, 09:44 AM IST
  • యూ ట్యూబర్ శ్రీకాంత్‌రెడ్డి చెంప చెళ్లుమనిపించిన కరాటే కల్యాణి
    ప్రాంక్ వీడియోలపై కరాటే కల్యాణి ఆగ్రహం
    సమాజాన్ని ఏం చేస్తారంటూ శ్రీకాంత్‌తో వార్
    మహిళ అని చూడకుండా కల్యాణిపై దాడి చేసిన శ్రీకాంత్
Karate Kalyani slaps Srikanth Reddy : యూ ట్యూబర్ శ్రీకాంత్‌రెడ్డి చెంప చెళ్లుమనిపించిన కరాటే కల్యాణి

Karate Kalyani slaps Srikanth Reddy : ఎస్‌ఆర్‌ నగర్‌ పీఎస్‌ పరిధిలో టాలీవుడ్ నటి కరాటే కల్యాణి.. యూ ట్యూబర్ శ్రీకాంత్‌ రెడ్డి నడి రోడ్డుపైనే పరస్పరం దాడి చేసుకున్నారు. ప్రాంక్ పేరుతో మహిళలపై బూతులతో, డబుల్ మీనింగ్ డైలాగులతో ఇష్టం వచ్చినట్లు చేతులు వేస్తున్నాడంటూ కల్యాణి అతనిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రాంక్స్ పేరుతో అమ్మాయిలు, మహిళల గౌరవాన్ని దెబ్బతిస్తున్నాడంటూ శ్రీకాంత్‌తో రోడ్డుపైనే వాగ్వాదానికి దిగింది కల్యాణి. అయితే కల్యాణిని తిరిగి దూషిస్తూ శ్రీకాంత్ కూడా దాడికి దిగాడు. దీంతో రోడ్డుపైనే పరస్పరం దాడికి దారితీసింది.

యూసుఫ్ గూడ బస్తీలో ఈ ఘటన చోటు చేసుకుంది. దాదాపు గంటకు పైగా రచ్చ రచ్చ చేశారు. ప్రాంక్ వీడియోలు మానేయాలని, సమాజాన్ని ఏం చేయాలనుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ కరాటే కల్యాణి శ్రీకాంత్ రెడ్డి ఇంటి దగ్గరికెళ్లి మరీ చెంప ఛెళ్లుమనిపించింది. ప్రాంక్ పేరుతో సంబంధంలేని మహిళలపై ఇష్టం వచ్చినట్లు చేతులు వేస్తున్నాడంటూ కల్యాణి ఆగ్రహం వ్యక్తం చేసింది. అమ్మాయిలను ఫ్లర్టింగ్ చేసి గౌరవానికి భంగం కలిగిస్తున్నాడంటూ  రోడ్డుపైనే వాగ్వాదానికి దిగింది. ప్రాంక్ పేరుతో ఒంటరిగా వెళ్తున్న మహిళలను శ్రీకాంత్ రెడ్డి  రెచ్చగొట్టి కోరికలు తీర్చుకుంటున్నాడని ఆరోపించింది. ప్రశ్నిస్తున్న క్రమంలో కొడతావా అంటూ శ్రీకాంత్ రెచ్చగొట్టినట్టు మాట్లాడటంతో కరాటే కల్యాణి ఒక్కసారిగా అతని చెంప ఛెళ్లుమనిపించింది.

అయితే శ్రీకాంత్ తిరిగి దాడి చేశాడు. ఈ క్రమంలో శ్రీకాంత్ రెడ్డి బట్టలు ఉడదీసి రోడ్లపై పరుగెత్తించి కొట్టింది కరాటే కల్యాణి. ప్రాంక్స్ పేరుతో అడల్ట్ కంటెంట్ పెట్టి సమాజానికి కీడు చేస్తున్నారని కల్యాణి ఆరోపించింది. యూట్యూబ్‌లో ఉన్న శ్రీకాంత్ ప్రతి విడియో డిలీట్ అవాలని.. ఇక ముందు కూడా ఇలాంటి విడియోలు పెట్టకుండా చర్యలు తీసుకోవాలని కరాటే కల్యాణి డిమాండ్ చేసింది. మరోవైపు తనను లక్ష రూపాయలు ఇవ్వాలని కరాటే కల్యాణి డిమాండ్ చేసిందని శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు.

Also Read : Sarkaru Vaari Paata Collections : సర్కారు వారి పాటతో మహేష్ బాబుకు బ్లాక్ బస్టర్

Also Read : Tina death Mystery : ఆట కొరియోగ్రాఫర్ టీనా అనుమానస్పద మృతి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News