Singer Madhu Priya Song: మధుప్రియ సాంగ్‌ షూట్‌పై రచ్చ.. ఈవోపై వేటు

Madhu Priya Song Controversy: సింగర్ మధు ప్రియ సాంగ్‌ ఎఫెక్ట్‌తో అధికారులపై వేటు పడింది. కాళేశ్వరం ఇంఛార్జిపై సస్సెన్షన్ వేటుపడింది. కాళేశ్వరం క్షేత్రంలోని మధు ప్రియ సాంగ్‌ షూట్‌పై వివాదం నెలకొన్న విషయం తెలిసిందే.  

Written by - Ashok Krindinti | Last Updated : Jan 26, 2025, 10:25 PM IST
Singer Madhu Priya Song: మధుప్రియ సాంగ్‌ షూట్‌పై రచ్చ.. ఈవోపై వేటు

Madhu Priya Song Controversy: చిలికి చిలికి గాలి వానలా మారిన మధు ప్రియ పాట షూటింగ్ ప్రభావం చివరకు అధికారులను బాధ్యతల నుండి తప్పించే పరిస్థితి ఏర్పడింది. సింగర్ మధు ప్రియ ఇటీవల గర్భాలయంలో షూటింగ్ తీసుకునేందుకు ఇంఛార్జి ఈఓ మారుతి అనుమతి ఫోన్లో తీసుకున్నారు. అయితే మారుతితో పాటు ఆలయ సిబ్బంది, అర్చకులు కొంతమంది కాళేశ్వరం క్షేత్రంలో నిర్వహించనున్న కుంబాభిషేకం కార్యక్రమానికి పీఠాధిపతిని ఆహ్వానించేందుకు శృంగేరి పీఠానికి వెళ్లారు. 

అదే రోజున మధు ప్రియ కాళేశ్వరం క్షేత్రంలో పాట షూటింగ్ చేసుకునేందుకు రావడంతో ఆమె వెంట ఆలయ సిబ్బంది కూడా వెళ్లారు. వారంతా కూడా గర్భాలయంలో షూటింగ్ చేస్తున్నా వారించలేదు. మధు ప్రియ షూటింగ్ కు సంబంధించిన ఫోటోలు బయటకు రావడంతో పాటు వివిధ పత్రికల్లో వార్తలు కూడా వచ్చాయి. దీంతో ఆలయ ఈఓ ఆ సమయంలో డ్యూటీలో ఉన్న అర్చకుడు రామకృష్ణకు నోటీసులు ఇచ్చారు. మధు ప్రియ షూటింగ్ చేస్తున్న సమయంలో ఆలయ ఉద్యోగులు కూడా ఉన్న విషయం తెలియడంతో దేవాదాయ శాఖ ఉన్నతాధికారుల తీవ్రంగా పరిగణించినట్టుగా తెలిసింది. కాళేశ్వరం ఇంఛార్జిగా ఈఓగా  బాధ్యతలు నిర్వర్తిస్తున్న మారుతిని తొలగించి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ప్రముఖ పుణ్య క్షేత్రమైన కొటవటంచ ఈఓగా పనిచేస్తున్న మహేష్ ను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మధు ప్రియ తీసిన పాట షూటింగ్ ఎఫెక్ట్ వల్ల ఏకంగా ఈఓను బాధ్యతల నుండి తప్పించే వరకు రావడం గమనార్హం. 

మధు ప్రియపై చర్యలు..? 

అయితే దేవాదాయ శాఖ అధికారులు మధు ప్రియ పాట షూటింగ్ విషయాన్ని తీవ్రంగా పరిగణించి శాఖపరమైన చర్యలు తీసుకోవడం మొదలు పెట్టారు. అయితే పాట షూటింగ్ చేసిన మధు ప్రియపై ఎలాంటి చర్యలు తీసుకుంటారోనన్న చర్చ కూడా స్థానికంగా సాగుతోంది. ఆమె పౌర సంబంధాల విభాగంలో విధులు నిర్వర్తిస్తున్నారని, ఆమె భర్త సీఎంఓలో పని చేస్తున్నారని స్థానిక దేవాదాయ వర్గాలు చెప్తున్నాయి. నిబంధనలు ధిక్కరించి గర్భాలయంలో షూటింగ్ తీసిన మధుప్రియతో పాటు యూనిట్ సభ్యులపై చర్యలు తీసుకుంటారా లేదా అన్నది తేల్చాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ శాఖలో పని చేస్తున్న వారు అదే ప్రభుత్వ నిబంధనలు ధిక్కరించడం అనేది తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుందని అంటున్నారు. అంతేకాకుండా ఆమె షూటింగ్ తీసిన విషయంపై దేవాదాయ శాఖ అధికారులు ఐ అండ్ పీఆర్ విభాగానికి లేఖ రాశారా లేదా అన్న విషయం తెలియ రావడం లేదు. 

మరో వైపున మధు ప్రియ ఆమె బృందం తీసిన పాట ఆమె సొంత ఛానెల్స్ కోసం అయినట్టయితే ఆ విషయంపై కూడా దృష్టి సారించాల్సిన అవసరం కూడా ఉంది. ప్రభుత్వ విభాగం నుండి వేతనం తీసుకుంటూ తన సొంత ఛానెల్ కోసం షూటింగ్ తీసుకునేందుకు అధికారులు అనుమతి ఇచ్చారా లేదా అన్న విషయాన్ని కూడా తేల్చాల్సిన అవసరం ఉంది. సంబధిత శాఖ అధికారులు కూడా ఇందుకు అనుమతి ఇచ్చేందుకు ప్రభుత్వ నిబంధనలు అనుకూలంగా ఉన్నాయా లేదా అన్న విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. 

కేవలం దేవాదాయ శాఖ అధికారులను బాధ్యతల నుండి తప్పించి చర్యలు తీసుకున్నామన్న భావన కల్పించడంతో సరిపెట్టవద్దని అంటున్నారు స్థానికులు. ఆలయ అధికారులు షూటింగ్ సమయంలో గర్భాలయం తలుపులు వేయలేదని చెప్తున్నందన మధు ప్రియ బాజాప్తాగానే పాట షూటింగ్ చేసినట్టుగా స్పష్టం అయింది. ఆలయ ప్రాంగణంలో మాత్రమే షూటింగ్ చేసుకోవాలని అనుమతి ఇచ్చినా పట్టించుకోకుండా గర్భాలయంలో కూడా చిత్రీకరణ చేశారన్న విషయంపై చర్యలు తీసుకునేందుకు ఆమె పని చేస్తున్న విభాగదానికి కూడా లేఖ రాసినట్టయితే భవిష్యత్తులో మరోకరు ఇలాంటి దుస్సాహసానికి పాల్పడే అవకాశం లేదు. ఇప్పటికే ఈ విషయంపై దేవాదాయ శాఖ అధికారులకు మాల మహనాడు ఉత్తర తెలంగాణ అధ్యక్షుడు పీక కిరణ్ ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా బీజేపీ నాయకులు కూడా కాళేశ్వరంలో ధర్నా చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాబట్టి దేవాదాయ అధికారులు మధు ప్రియపై కూడా చర్యలు తీసుకునేందుకు సంబంధిత శాఖకు సిఫార్సు చేయాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

Also Read: Maha Kumbh Mela 2025: మహా కుంభమేళాలో టీమిండియా క్రికెటర్లు.. సాధువులుగా మారిపోయారంటే..! 

Also Read: Govt Employees: ప్రభుత్వ ఉద్యోగులకు జాక్‌పాట్‌.. నాలుగు రోజులే పనిదినాలు, 3 రోజులు ఆఫ్‌?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News