Jr NTR fans:జూనియర్ ఎన్టీఆర్ ఇంటిదగ్గర అభిమానుల రచ్చ.. పోలీసుల లాఠీఛార్జ్

Jr NTR fans Nuisance: టాలీవుడ్ మోస్ట్ పాపులర్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ఇవాళ 39వ జన్మదినం జరుపుకుంటున్నారు. తమ అభిమాన హీరో బర్త్ డే కావడంతో తారక్ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. హైదరాబాద్ కు భారీగా తరలివచ్చిన జూనియర్ ఫ్యాన్స్.. అర్ధరాత్రి అతని నివాసం దగ్గర హంగామా చేశారు.

Written by - ZH Telugu Desk | Last Updated : May 20, 2022, 07:25 AM IST
  • జూనియర్ ఎన్టీఆర్ ఇంటిదగ్గర అభిమానుల రచ్చ
  • కేకలు వేస్తూ డ్యాన్సులు చేసిన తారక్ ఫ్యాన్స్
  • లాఠీ చార్జ్ చేసిన చెదరగొట్టిన పోలీసులు
Jr NTR fans:జూనియర్ ఎన్టీఆర్ ఇంటిదగ్గర అభిమానుల రచ్చ.. పోలీసుల లాఠీఛార్జ్

Jr NTR fans Nuisance: టాలీవుడ్ మోస్ట్ పాపులర్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ఇవాళ 39వ జన్మదినం జరుపుకుంటున్నారు. తమ అభిమాన హీరో బర్త్ డే కావడంతో తారక్ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. హైదరాబాద్ కు భారీగా తరలివచ్చిన జూనియర్ ఫ్యాన్స్.. అర్ధరాత్రి అతని నివాసం దగ్గర హంగామా చేశారు. ఎన్టీఆర్ బర్త్ డే కావడంతో ఆయన నివాసానికి అర్ధరాత్రి అభిమానులు భారీగా తరలివచ్చారు.తారక్ ఇంటి ముందు కేక్ కట్ చేశారు. ఎన్టీఆర్ ను బయటికి రావాలని నినాదాలు చేశారు. అయితే జూనియర్ బయటికి రాకపోవడంతో ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జూనియర్ ఇంటి ముందు హంగామా చేశారు. కేకలు వేస్తూ డ్యాన్సులు చేశారు. జూనియర్ అభిమానులు అల్లరి శృతి మించడంతో వాహనదారులు, స్థానికులు ఇబ్బంది పడ్డారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వాళ్లను అక్కడి నుంచి తరలించడానికి ప్రయత్నించారు. అయినా వినకపోవడంతో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. పోలీసులు లాఠీలకు పని చెప్పడంతో అభిమానులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook    

Trending News