JC Diwakar Reddy on CM KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ వేదికగా చేసిన ఉద్యోగ నోటిఫికేషన్ల ప్రకటన దేశ చరిత్రలో నిలిచిపోతుందన్నారు ఏపీకి చెందిన మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి. ఈ ప్రకటనతో కచ్చితంగా యువతలో క్రేజ్ వస్తుందన్నారు. ఇంత భారీ సంఖ్యలో ఏ రాష్ట్రం ఉద్యోగ నియామకాలు చేపట్టలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పటివరకూ ఇలాంటి ప్రకటన చేయలేదన్నారు. బుధవారం (మార్చి 9) హైదరాబాద్‌లో జేసీ మీడియాతో మాట్లాడారు.
సీఎం కేసీఆర్‌ను కలిసేందుకు ప్రయత్నించినప్పటికీ వీలు కాలేదన్నారు జేసీ దివాకర్ రెడ్డి. సీఎం అపాయింట్మెంట్ దొరకలేదన్నారు. అపాయింట్మెంట్ ఓకె అయితే కబురు పెడుతామని చెప్పారన్నారు. సీఎంలను కలిసేందుకు ఒకప్పుడు ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేదన్నారు. ఏపీలో మంత్రులకే అపాయింట్‌మెంట దొరకని పరిస్థితి నెలకొందన్నారు.
ఏపీలో ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి కూడా ప్రభుత్వం వద్ద డబ్బులు లేవన్నారు. సీఎం జగన్ మూడు రాజధానుల అంశాన్ని వదిలేసినట్లే కనిపిస్తోందని.. మంత్రి బొత్స చేసిన ప్రకటన అందుకు ఊతమిచ్చేలా ఉందని అన్నారు. మరో రెండేళ్లు ఏపీ రాజధాని హైదరాబాదేనని బొత్స చేసిన వ్యాఖ్యలపై జేసీ ఇలా స్పందించారు. మంత్రి బొత్స మళ్లీ హైదరాబాద్ వెళ్లాలనుకుంటున్నారని.. అందుకే అలా మాట్లాడుతున్నారని అన్నారు. రాష్ట్రానికి ఒకటి కాకపోతే పది రాజధానులు పెట్టుకోని.. అది మా సీఎం జగన్ ఇష్టమంటూ వ్యాఖ్యానించారు.
Also Read: Jagga Reddy: జగ్గారెడ్డి రూటే సెపరేటు.. సీఎం కేసీఆర్‌పై ప్రశంసలు.. ప్రత్యేక ధన్యవాదాలు...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook