20 Trains cancelled: హైదరాబాద్: మౌలిక సదుపాయాల నిర్వహణ పనుల కారణంగా హైదరాబాద్, సికింద్రాబాద్ డివిజన్లలో ఆగస్టు 14 నుంచి ఆగస్టు 20 వరకు వారం రోజుల పాటు 20 రైళ్లు, 22 ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. కాజీపేట్ - డోర్నకల్ , డోర్నకల్ - కాజీపేట , డోర్నకల్ - విజయవాడ , విజయవాడ - డోర్నకల్ , భద్రాచలం రోడ్ - విజయవాడ , విజయవాడ - భద్రాచలం రోడ్ , కాజీపేట - సిర్పూర్ టౌన్ , బల్హర్షా - కాజీపేట , భద్రాచలం రోడ్ - బల్లార్ష, సిర్పూర్ టౌన్ - భద్రాచలం రోడ్ , సికింద్రాబాద్ - వరంగల్ , వరంగల్ - హైదరాబాద్ , సిర్పూర్ టౌన్ - కరీంనగర్ , కరీంనగర్ - సిర్పూర్ టౌన్ , కరీంనగర్ - నిజామాబాద్ , నిజామాబాద్ - కరీంనగర్ , కాజీపేట - బల్హర్షా, బల్హర్షా - కాజీపేట, కాచిగూడ - నిజామాబాద్ , నిజామాబాద్ - కాచిగూడ మార్గాల్లో 20 రైళ్లను రద్దు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్పో తెలిపారు.
దౌండ్ - నిజామాబాద్ మార్గంలో పాక్షికంగా అంటే.. నిజామాబాద్ - ముద్ఖేడ్ మధ్య రైళ్లు రద్దు కానున్నాయి. అలాగే నిజామాబాద్ - పంఢర్‌పూర్ మార్గంలోనూ పాక్షికంగా రైళ్లు రద్దు కానున్నాయి. ఈ మార్గంలో నిజామాబాద్ - ముద్ఖేడ్ మధ్య పాక్షికంగా రైళ్లు రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. హైదరాబాద్ - లింగంపల్లి, ఫలక్‌నుమా - లింగంపల్లి , అలాగే ఉమ్దానగర్ - లింగంపల్లి మార్గాల్లో ఈ వారం రోజుల పాటు 22 ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు కానున్నాయి.
ఇది కూడా చదవండి : Independence Day 2023: జాతీయ జెండా పరిమాణం ఎంత ఉండాలి, జెండా వందనంలో ఫ్లాగ్ కోడ్ ఏం చెబుతోంది
ఇదిలావుంటే, మరోవైపు నాందేడ్ - ముంబైలోని ప్రధాన రైల్వే స్టేషన్ అయిన ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ మధ్య నడిచే రాజ్య రాణి ఎక్స్‌ప్రెస్ ఆగస్ట్ 13 , 14 తేదీల్లో రద్దు చేసినట్టు రైల్వే అధికారులు తమ ప్రకటనలో పేర్కొన్నారు. చత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ నుండి నాందేడ్ వైపు రాకపోకలు సాగించే రాజ్య రాణి ఎక్స్‌ప్రెస్ రైలుని సైకం ఆగస్టు 14, 15 తేదీలలో రద్దు చేసినట్టు స్పష్టంచేశారు.
ఇది కూడా చదవండి : Independence Day 2023: దేశానికి స్వాతంత్య్రం లభించిన రోజు గాంధీ దీక్ష ఎందుకు చేశారు, గాంధీజీ జీవితంలో ఆసక్తికర అంశాలివే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి