Azadi Ka Amrit Mahotsav Celebrations: హైదరాబాద్: ఆగస్టు 15న ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరిట జరగనున్న పంద్రాగస్టు వేడుకల్లో ఉగ్రవాదులు దాడులకు పాల్పడి కల్లోలం సృష్టించాలని కుట్రలుపన్నే ప్రమాదం ఉందని సెంట్రల్ ఇంటెలిజెన్స్ బ్యూరో హెచ్చరించింది. కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు అప్రమత్తం అయ్యారు. లష్కరే తొయిబా, జైషే మహమ్మద్, ఐఎస్ఐఎస్ వంటి ఉగ్రవాద సంస్థలు హైదరాబాద్ లో దాడులకు పాల్పడి విధ్వంసం సృష్టించే ప్రమాదం లేకపోలేదని తెలంగాణ పోలీసు శాఖకు ఇంటెలీజెన్స్ బ్యూరో హెచ్చరికలు జారీచేసింది.
హైదరాబాద్‌కి ఉదయ్‌పూర్‌లో టైలర్ కన్నయ్య లాల్ మర్డర్ కేసుకి కనెక్షన్..
ఇటీవలే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉదయ్‌పూర్‌లో టైలర్ కన్నయ్య లాల్ మర్డర్ కేసులోనూ దర్యాప్తు చేపట్టిన ఎన్ఐఏ పోలీసులు హైదరాబాద్‌లో ఓ నిందితుడిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా దేశంలో ఎక్కడ ఏ ఉగ్రదాడి జరిగినా ఆయా ఘటనలకు సంబంధించిన మూలాలు హైదరాబాద్‌లో వెలుగు చూడటం మనం తరచుగా చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలోనే దేశ రాజధాని ఢిల్లీతో పాటు దేశంలోని పెద్ద నగరాలను లక్ష్యంగా చేసుకుని పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు దాడులకు పాల్పడే అవకాశాలు ఉన్నాయని కేంద్ర నిఘా వర్గాలు తమ హెచ్చరికల్లో పేర్కొన్నాయి.
హైదరాబాద్‌లో పర్యాటకులతో రద్దీగా ఉండే పర్యాటక ప్రాంతాలు, వీవీఐపీలు నివాసం ఉండే ప్రదేశాలలో నిఘా ముమ్మరం చేశారు. ముఖ్యంగా విదేశీ ప్రయాణికులు ఎక్కువగా రాకపోకలు సాగించే శంషాబాద్ విమానాశ్రయంతో పాటు ప్రయాణికుల రద్దీతో కిక్కిరిసిపోయే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, కాచీగూడా రైల్వే స్టేషన్, నాంపల్లి రైల్వే స్టేషన్లలో భద్రత మరింత కట్టుదిట్టం చేశారు. అలాగే ఎంజీబీఎస్, జేబీఎస్ బస్ స్టేషన్లలోనూ పోలీసులు తనిఖీలు చేపట్టారు. అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఇదిలావుంటే, మరోవైపు శంషాబాద్ విమానాశ్రయంలో ఈ నెల 30 వరకు హైఅలర్ట్ ప్రకటించినట్టు ఎయిర్‌పోర్ట్ అధికారులు, హైదరాబాద్ పోలీసు ఉన్నతాధికారులు (Hyderabad police) తెలిపారు.
Also Read : Munugode Byelection: రేవంత్ రెడ్డికి పాల్వాయి స్రవంతి వార్నింగ్.. మునుగోడు కాంగ్రెస్ లో టికెట్ లొల్లి
Also Read : Rythu Bima: తెలంగాణ రైతులకు శుభవార్త.. రైతు బీమా నమోదు గడువు పెంపు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P2DgvH
Apple Link - https://apple.co/3df6gDq
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook