Telangana Weather Reports: ఆరంభం ఆందోళన రేకెత్తించిన వర్షాకాలం రెండో నెలలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఆశించిన వర్షాలు పడుతుండడంతో రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో వరద పోటెత్తుతోంది. ఈ కారణంగా రాష్ట్రంలోని గోదావరితోపాటు కృష్ణా పరివాహాక ప్రాజెక్టులు జలకళ సంతరించుకున్నాయి. జూరాల, శ్రీశైలం నిండుకుని వరద పరవళ్లు తొక్కుతుండడంతో నాగార్జున సాగర్ కూడా నిండుకుని గేట్లు తెరచుకుంది. రాష్ట్రంలో కొంత విరామం తర్వాత మళ్లీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ ప్రకటించింది.
Also Read: Nagarjuna Sagar: శ్రీశైలం నుంచి సాగర్ కు కొనసాగుతున్న వరద.. సాగర్ గేట్లు ఓపెన్..
తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ నివేదికను వాతావరణ శాఖ విడుదల చేసింది. ఈ సందర్భంగా వాతావరణ హెచ్చరికలు జారీ చేసింది. ఈశాన్య మధ్యప్రదేశ్, దాని పరిసర దక్షిణ ఉత్తరప్రదేశ్ వద్ద కేంద్రీకృతమై ఉన్న తీవ్ర వాయుగుండం తెలంగాణకు దూరంగా కదిలిపోయింది. ఈ కారణంగా వర్షాలు తగ్గుముఖం పట్టనున్నాయి. పశ్చిమ, నైరుతి దిశల నుంచి తెలంగాణ రాష్ట్రం వైపు గాలులు వీస్తున్నాయి.
Also Read: Nagarjuna Sagar: సగం నిండిన నాగార్జున సాగర్.. 2 లక్షల పైగా వరద..
మోస్తరు వర్షాలు
కొంత విరామం తీసుకున్న వర్షాలు మళ్లీ తెలంగాణలో పడనున్నాయి. సోమ, మంగళ, బుధవారాల్లో రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే రాష్ట్రవ్యాప్తంగా కాకుండా కొన్ని ప్రాంతాల్లో మాత్రమే వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ వెల్లడించారు. ఈ మూడు రోజుల పాటు అన్ని జిల్లాలలో అక్కడక్కడ బలమైన ఉపరితల గాలులు గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం అవకాశం ఉంది. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం సంచాలకులు తమ నివేదికలో తెలిపారు.
ప్రాజెక్టులకు జలకళ
రాష్ట్రంలో గోదావరి కన్నా కృష్ణ పరివాహాక ప్రాంత ప్రాజెక్టులకు భారీగా వరద చేరుకుంటోంది. రాష్ట్రంలో మోస్తరు వర్షాలు పడుతున్నా ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాజెక్టులకు నీరు ఊహించని రీతిలో వస్తోంది. కర్ణాటకలోని నారాయణపూర్, ఆల్మట్టి ప్రాజెక్టులతోపాటు రాష్ట్రంలోని జూరాల, శ్రీశైలం ప్రాజెక్టులు నిండుకున్నాయి. శ్రీశైలం గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేయడంతో నాగార్జున సాగర్‌కు వరద పరవళ్లు తొక్కుతోంది. ఆ ప్రాజెక్టు కూడా నిండుకోవడంతో సోమవారం నాగార్జున సాగర్ గేట్లు తెరచుకున్నాయి. దీంతో కృష్ణా పరివాహాక ప్రాంతంలోని ప్రాజెక్టులు జళకళతో తొణికిసలాడుతున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter